తాతతో మనవడు.. జూనియర్ NTR రేర్ ఫొటోస్ ఇవే!

samatha

21 may 2026

జూనియర్ ఎన్టీఆర్, తారక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ హీరో చాలా మంది ఫేవరెట్. తన నటనతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ 20 మే 1983లో జన్మించిన విషయం తెలిసిందే. నిన్న ఈయన తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు.

తారక్

ఇక బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాల నటుడిగా నటించిన ఈ హీరో, స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో హీరోగా తెలుగు అభిమానులకు పరిచయం అయ్యాడు.

బాలనటుడు

ఈ మూవీ తర్వాత ఆది, సింహాద్రి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సింహాద్రి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

సింహాద్రీ

ఇక ఈ మూవీ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ మూవీ, దేవర మూవీతో పాన్ ఇండియా లెవల్‌ల్లో సత్తా చాటుతున్నాడు.

త్రిబుల్ ఆర్

తన నటనతోనే కాకుండా, డైలాగ్ డెలవరీ, తన డ్యాన్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తన నటనతో ప్రతి ఒక్కరినీ ఫిదా చేశారు.

నటన, డైలాగ్ డెలవరీ

అయితే ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

చైల్డ్ హుడ్ ఫొటోస్

ఈ క్రమంలో తారక్  తన తాత అయిన సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న కొన్ని బ్యూటిపుల్ ఫొటోస్ వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ ఫొటోస్ ప్రతి ఒక్కరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

తారక్, తాత