ఎండాకాలంలోనే ఎర్ర చీమలు.. అసలు వేసవికి చీమలకు మధ్య ఉన్న సంబంధం తెలుసా?

samatha

26 may 2026

చూస్తే చిన్నవే కానీ చీమలతో ఉండే తలనొప్పి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సమ్మర్ వస్తే చాలు ఇంటిలో వీటి గోల ఎక్కువగా ఉంటుంది.

చీమలు

చాలా వరకు చీమలు ప్రతి సీజన్‌లో కనిపించడం సహజం. కానీ సమ్మర్ వస్తే చాలు ఇంటిలో చీమలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఎర్ర చీమలు చాలా కనిపిస్తుంటాయి.

ఎర్ర చీమలు

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఎండాకాలంలో ఎర్ర చీమలు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయో, ఇప్పుడు మనం వాటి గురించే వివరంగా తెలుసుకుందాం.

సమ్మర్

అన్ని సీజన్‌లో కంటే, వేసవి కాలం చీమలకు చాలా ఇష్టమైన సీజన్. అందుకే చీమలు ఈ సీజన్‌లో చాలా చురుకుగా ఉంటూ ఎక్కువ పని చేస్తాయంట.

వేసవి

ముఖ్యంగా చీమలు ఎక్కువగా ఎండాకాలంలోనే ఎక్కువ మొత్తంలో ఆహారం నిలువ చేసుకుంటాయి. ఆహారం నిలువకు చీమలకు బెస్ట్ సీజన్ అంటే వేసవి కాలమే అని చెబుతున్నారు నిపుణులు.

ఆహారం నిల్వ

అందుకే అవి ఎండాకాలంలో ఎక్కడ ఉన్నా సరే ఇళ్లలోకి వచ్చి, తమకు కావాల్సిన ఆహారాన్ని సేకరించుకుంటాయట. ముఖ్యంగా త్వరలో వర్షాకాలం వస్తుంది.

ఆహారం సేకరణ

అయితే ఆ సమయంలో చల్లని వాతావరణం, ఎక్కువగా నీరు ఉంటుంది. దీంతో చీమలు బయటకు రావడం కష్టం. అందువలన ఆ కష్ట కాలంలో సమయంలో ఇబ్బంది లేకుండా ఇప్పుడే ధాన్యాన్ని సేకరించుకుంటాయట.

ధాన్యం సేకరణ

అందుకే వేసవి కాలంలోనే చీమలు ఎక్కువగా ఇళ్లల్లో కనిపిస్తున్నాయి అని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎరుపు రంగు చీమలు ఈ సీజన్‌లో చాలా చురుకుగా మారి ఆహారం సేకరించుకుంటాయట.

చీమలు ఎక్కువ