తెలివి తక్కువ అని అందరూ వెక్కిరించే పక్షి.. పాపం ప్రపంచంలోనే అమాయకమైనది!
samatha
24 may 2026
ప్రకృతిలో ఎన్నో రకాల పక్షలు జంతువులు, అందమైన మొక్కలు ఉన్నాయి. ఇక ఒక్కొక్కటీ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
ప్రకృతి
అయితే అన్నింట్లో కెళ్లా, ఒక పక్షి చాలా డిఫరెంట్ అంటున్నారు నిపుణులు. అంతే కాదండోయ్ దానిని తెలివి తక్కువ పక్షి అని వెక్కిరిస్తుంటారంట.
షూబిల్ పక్షి
ఎందుకు? పక్షిని తెలివి తక్కువ అంటారు? ఇంతకీ ఆ పక్షి ఏదో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అమాయకమైన పక్షి 'షూబిల్' పక్షి.
తెలివి తక్కువ పక్షి
ప్రపంచంలోనే వింతైన, అమాయకపు పక్షి ఇదే. దీని ముక్కు ఆకారం షూ మాదిరి చాలా వింతగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఎక్కువగా తూర్పు ఆఫ్రికాలోని చిత్తడి నేలల్లో కనిపిస్తుంది.
ప్రపంచంలోనే వితైన, అమాయకపు పక్షి
షూబిల్ ఎత్తు దాదాపు 5 అడుగులు. రెక్కలు విప్పితే 8 అడుగుల వరకు ఉంటుంది. ఇది గంటల తరబడి కదలకుండా విగ్రహంలా నిలబడి చేపల కోసం వేటాడుతుంది.
గంటల కొద్ది విగ్రహంలా నిలబడుతుంది
అయితే దీనిని తెలివి తక్కువ పక్షి ఎందుకు అన్నారు అంటే? ఇది ఆహారం కోసం చాలా వేటాడుతుంది. కానీ దీని ఆలోచనా సామర్థ్యం తక్కువగా ఉండటం వలన కొన్ని సార్లు ముందు ఆహారం ఉన్నా తినలేదంట. ఏమీ తోచనట్లు అలానే చూస్తూ ఉండిపోతుంది.
ఆహారం కోసం వేట
షూబిల్ చేపల కోసం 3,4 గంటలు ఒకే చోట విగ్రహంలా నిలబడిపోతుంది. మనుషులు చూస్తే దీనికి అసలు రియాక్షన్ లేదు, దద్దమ్మ అనుకుంటారు. కానీ అదే దాని వేట టెక్నిక్. కదలకుండా ఉంటేనే చేపలు దగ్గరికి వస్తాయి.
మనుషులను చూస్తే నో రియాక్షన్
రెండు పిల్లల్లో పెద్దది చిన్నదాన్ని పొడిచి చంపేస్తుంది. తల్లి పక్షి అడ్డుకోదు. అందుకే దీన్ని చూసి కనికరం లేని, తెలివి లేని పక్షి అంటారు. కానీ ఇది నేచర్ రూల్. ఆహారం తక్కువ ఉన్న చోట ఒక బలమైన పిల్లనే బతికిస్తే జాతి మనుగడ సాగుతుంది.
ఒకే పిల్లనే బతికిస్తుంది
చాలా పక్షులు మనిషిని చూడగానే ఎగిరిపోతాయి. కానీ షూబిల్ మాత్రం మనల్ని అలాగే తదేకంగా చూస్తూ నిలబడుతుంది. కళ్ళు కూడా ఆర్పదు. దీంతో దీనికి భయం లేదు, బుర్ర లేదు అని జోక్స్ వేస్తారు.