పారిజాతం చెట్టు గుబురుగా పూయాలి అంటే.. ఈ ఒక్క చిట్కా చాలు!
Samatha
28 May 2026
ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంటిలో పారిజాతం చెట్టు అనేది తప్పక ఉంటుంది. హిందూ మతంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.
పారిజాతం చెట్టు
అలాగే ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే చాలా మంది దీనిని ఇంటిలో నాటుకొని ప్రతి నిత్యం పూజలు చేస్తుంటారు.
ఆధ్యాత్మికంగా
వాస్తు ప్రకారం ఇంటిలో పారిజాతం చెట్టు సరైన దిశలో ఉండటం మంచిది, ముఖ్యంగా ఇది చెట్టు నిండా పూలు పూస్తే కలిసి వస్తుంది అంటారు. కానీ కొంత మంది ఇంటిలో సరిగ్గా పూలు పూయదు.
వాస్తు ప్రకారం
అయితే పారిజాతం చెట్టు గుబురుగా పూలు పూయాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
చెట్టు గుబురుగా పూయడం
కొమ్మలను కత్తిరించడం ముఖ్యంగా, చెట్టు పెరిగే కొద్దీ కొమ్మలు కట్ చేస్తూ ఉండాలి. దీని వలన మొక్క చిగురించి, కొత్త మొగ్గలు పెట్టి ఎక్కువగా పూలు పూస్తుంది.
కొమ్మలు కత్తిరించడం
అలాగే పారిజాతం చెట్టుకు తప్పకుండా ఆవు పేడ లేదా వర్మి కంపోస్ట్ వంటి సహజమైన ఎరువులను అందించాలంట. దీని వలన ఇది పూలు బాగా పూస్తుంది.
ఎరువులు వేయడం
అలాగే పారిజాతం మొక్కకు దాదాపు ఆరు గంటల పాటు మంచి ఎండ అవసరం, అందువలన దీనిని నాటేటప్పుడే సూర్యరశ్మి తాకే చోట నాటుకోవాలి.
సూర్యరశ్మి
ప్రతి రోజూ తప్పకుండా నీరు పోయాలి. అలాగే ఎప్పుడూ చెట్టు మొదట నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. లేకపోతే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.