రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలుసా?

September 28, 2026

Subhash

చాలామంది నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టి ఉదయం వరకు అలాగే వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

రాత్రంతా

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో ఓవర్‌చార్జింగ్‌ను నియంత్రించే స్మార్ట్ ఛార్జింగ్ వ్యవస్థలు ఉంటాయి. బ్యాటరీ 100%కి చేరుకున్న తర్వాత ఫోన్ సాధారణంగా ఛార్జింగ్‌ను నియంత్రిస్తుంది లేదా నిలిపివేస్తుంది.

ఛార్జ్

ఫోన్‌ను రాత్రంతా ప్లగ్‌డ్‌లో ఉంచడం వల్ల సాధారణంగా బ్యాటరీ వెంటనే పాడైపోదు. అయితే బ్యాటరీని ఎక్కువసేపు 100% వద్ద ఉంచడం దీర్ఘకాలంలో బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపవచ్చు.

రాత్రంతా

ఛార్జింగ్ సమయంలో ఫోన్ అధికంగా వేడెక్కితే బ్యాటరీ పనితీరు, జీవితకాలంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే ఛార్జింగ్ సమయంలో ఫోన్‌ను వేడి ప్రదేశాల్లో ఉంచకండి.

ప్రమాదం

ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి దిండు, దుప్పటి లేదా ఇతర వస్తువుల కింద ఉంచడం వల్ల వేడి బయటకు వెళ్లడం కష్టమవుతుంది. అధిక వేడి బ్యాటరీకి హాని కలిగించవచ్చు.

ఛార్జింగ్‌

నాసిరకం లేదా దెబ్బతిన్న ఛార్జర్లు, కేబుల్స్‌ వల్ల ఛార్జింగ్ సమస్యలు లేదా పరికరానికి నష్టం కలగవచ్చు. మీ ఫోన్‌కు అనుకూలమైన, నాణ్యమైన ఛార్జర్‌ను ఉపయోగించడం మంచిది.

చౌక ఛార్జర్లతో

భారీగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. సోమవారం రికార్డు స్థాయిలో తగ్గడం మహిళలకు భారీ ఊరటనిస్తోంది.

బ్యాటరీ లైఫ్

మంచి నాణ్యత గల ఛార్జర్ ఉపయోగించండి. ఛార్జింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా చూడండి. దిండు/దుప్పటి కింద పెట్టి ఛార్జ్ చేయకండి. మీ ఫోన్‌లో Battery Protection ఉంటే ఉపయోగించండి

గుర్తుంచుకోండి