ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు 2026
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు తదితర 17 మున్సిపల్ కార్పొరేషన్లు సహా మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ నవంబర్ 1న నిర్వహించి ఓట్ల లెక్కింపు నవంబర్ 3న జరగనుంది. ఏపీలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా వాటిలో 100కి ఎన్నికలు జరుగుతాయి.
అలాగే MPTC, ZPTCలకు నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపడుతారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలను నవంబర్ 26, నవంబర్ 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. తాజా మార్పుల కోసం ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనలను పరిశీలించాలి.
ఇంకా చదవండిఏపీలో MPTC, ZPTC ఎన్నికల తేదీలు మార్పు.. పోలింగ్, కౌంటింగ్ తేదీలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రక్రియతో సమన్వయం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను సవరించింది. ఈ మార్పులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, రీపోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలు మారనున్నాయి.
- Balaraju Goud
- Updated on: Oct 29, 2026
- 11:00 am
ఇదో చిత్రమైన గ్రామకథ! కళ్ల ముందే తహశీల్దార్ కార్యాలయం.. అయినా 7 కిలోమీటర్ల ప్రయాణం!
స్థానిక ఎన్నికల వేళ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం అలీనగర్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. గ్రామంలో రోడ్డును విభజన రేఖగా మార్చి ఒక వైపు దుగ్గిరాల పంచాయితీలో మరొకవైపు కొలకలూరు పంచాయితీలో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. దుగ్గిరాల గ్రామ పంచాయితీ పరిధిలోని చివరి కాలనీ అలీనగర్.
- T Nagaraju
- Updated on: Oct 29, 2026
- 11:02 am
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని ఆదేశం!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. నామినేషన్ల దశలో తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు వాస్తవాలతో ముడిపడి ఉన్నాయని, ఈ దశలో వాటిని నిర్ధారించడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది.
- Balaraju Goud
- Updated on: Oct 29, 2026
- 11:03 am
MPTC Elections: ఒకే ఇంట్లో రెండు జెండాలు.. ఎన్నికల బరిలో తోటికోడళ్లు.. ఎక్కడంటే?
ఇంట్లో కలిసుండే తోటికోడళ్లు.. రాజకీయాల్లోకి వచ్చేసరికి పరస్పరం తలపడే ప్రత్యర్థులుగా మారితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి రసవత్తర సమరానికే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేదికైంది. ఒకే ఇంటి తోటికోడళ్లు జనసేన, వైసీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగడం ఇప్పడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- B Ravi Kumar
- Updated on: Oct 26, 2026
- 3:27 pm
AP DGP: ఏపీలో ఎన్నికల హింసపై డీజీపీ సీరియస్.. కీలక ప్రకటన
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై డీజీపీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా13 జిల్లాల్లో 31 ఎన్నికల సంబంధిత ఘటనలు చోటుచేసుకోగా, వీటిలో 22 ప్రత్యక్ష హింసాత్మక ఘటనలు, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడానికి సంబంధించి మరో 9 ఘటనలు ఉన్నట్లు వెల్లడించారు.
- Anand T
- Updated on: Oct 26, 2026
- 3:28 pm
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు రీషెడ్యూల్.. మళ్లీ ఎప్పుడంటే?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జరగబోయే 99 పట్టణ, నగర స్థానిక సంస్థల ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను నాలుగు రోజుల పాటు వాయిదా వేస్తూ కొత్త తేదీలను ప్రకటించింది.
- Anand T
- Updated on: Oct 26, 2026
- 3:28 pm
Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. ఈసీ సడెన్ డెసిషన్..
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 13 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిపివేసింది. ఈసీ ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. తొలుత కొన్ని స్థానాల్లో నిలిపివేయాలని భావించగా.. ఇప్పుడు అన్ని స్థానాల్లో బ్రేక్ పడింది.
- Venkatrao Lella
- Updated on: Oct 26, 2026
- 3:29 pm
ఏపీ మున్సిపల్ ఎన్నికలు: ఆ కార్పొరేషన్‌లో పోలింగ్ తేదీ మార్పు.. కారణం ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నేపథ్యంలో విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్‌ను అక్టోబర్ 28 నుంచి 29వ తేదీకి మార్చింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండటంతో కూటమి నేతలు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
- Shaik Madar Saheb
- Updated on: Oct 26, 2026
- 3:30 pm