AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Panchayat Elections LIVE Updates: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం.. 3,803 సర్పంచ్ స్థానాలకు పోలింగ్!

AP Panchayat Elections 2nd Phase Voting Live Updates in Telugu: ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 3,803 సర్పంచ్ స్థానాలకు, వేలాది వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఫలితాలు వెల్లడికానున్నాయి. 83 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

AP Panchayat Elections LIVE Updates: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం.. 3,803 సర్పంచ్ స్థానాలకు పోలింగ్!
Andhra Pradesh Panchayat Elections
Shaik Madar Saheb
|

Updated on: Nov 29, 2026 | 7:02 AM

Share

LIVE NEWS & UPDATES

  • 29 Nov 2026 07:02 AM (IST)

    పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

    APలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది

    3804 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

    బరిలో 10 వేల 295 మంది అభ్యర్థులు ఉన్నారు.

  • 29 Nov 2026 06:57 AM (IST)

    పంచాయతీ ఎన్నికల బరిలో 10 వేల 295 మంది అభ్యర్థులు

    APలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్

    4975 స్థానాలకు నోటిఫికేషన్ జారీ, 1095 స్థానాలు ఏకగ్రీవం

    3804 సర్పంచ్ స్థానాలకు జరుగుతున్న పోలింగ్

    బరిలో 10 వేల 295 మంది అభ్యర్థులు

    ఇక వార్డుల విషయానికి వస్తే.. 49 వేల 318 స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది

    19 వేల 655 వార్డులు ఏకగ్రీవమయ్యాయి

    29 వేల 603 వార్డుల్లో పోలింగ్ జరుగుతుంది

    63 వేల 395 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు

    83 లక్షల 52 వేల 338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు

    ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం

    మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్న పోలింగ్

    రెండు గంటలకు ప్రారంభం కానున్న లెక్కింపు ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రెండో విడతలో 3 వేల 804 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యుల ఎన్నికలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. రెండో విడత ఎన్నికల్లో మొత్తం 83 లక్షల 52 వేల 338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.

రెండో విడతలో మొత్తం 4,975 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇప్పటికే.. 1,170 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,803 స్థానాల్లో 10,295 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 49,318 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. 19,655 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29,603 స్థానాల్లో 63,395 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

రెండో విడత కోసం 50,476 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు 9,300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు.. 8,470 వెబ్‌కాస్టింగ్ గదుల ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

Published On - Nov 29,2026 6:55 AM

Follow Us
డిగ్రీ అర్హతతో ఏపీలో 378 ఎస్‌ఐ ఉద్యోగాలు నోటిఫికేషన్‌.. లింక్ ఇదే
డిగ్రీ అర్హతతో ఏపీలో 378 ఎస్‌ఐ ఉద్యోగాలు నోటిఫికేషన్‌.. లింక్ ఇదే
రోజూ 2 గుడ్లు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే! లాభాలు
రోజూ 2 గుడ్లు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే! లాభాలు
పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
హాఫ్ సెంచరీతో ఆదుకున్న జవాన్ కొడుకు.. కోహ్లీ సరసన జురేల్
హాఫ్ సెంచరీతో ఆదుకున్న జవాన్ కొడుకు.. కోహ్లీ సరసన జురేల్
ఏపీలో 1156 పోలీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఏపీలో 1156 పోలీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
శాంతించిన బంగారం ధరలు.. పెద్ద ఊరట వచ్చేసింది.. తులం ఎంతంటే..?
శాంతించిన బంగారం ధరలు.. పెద్ద ఊరట వచ్చేసింది.. తులం ఎంతంటే..?
టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు చెల్లింపునకు మరో అవకాశం!
టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు చెల్లింపునకు మరో అవకాశం!
చలి కాలంలో తినాల్సిన క్రిస్పీ మొక్కజొన్న పకోడి
చలి కాలంలో తినాల్సిన క్రిస్పీ మొక్కజొన్న పకోడి
నవంబర్ 29 రాశి ఫలాలు: వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి, వివాహ యోగం
నవంబర్ 29 రాశి ఫలాలు: వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి, వివాహ యోగం
పాక్‌కు మరో తలనొప్పి.. PoKలో సాయుధ తిరుగుబాటు!
పాక్‌కు మరో తలనొప్పి.. PoKలో సాయుధ తిరుగుబాటు!