AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ 29 రాశి ఫలాలు: వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి, వివాహ యోగం

దిన ఫలాలు (నవంబర్ 29, 2026): ఆదివారం కొన్ని రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ విషయాల్లో అనుకూల పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభించడంతో పాటు, కొందరికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలగడంతో పాటు చేపట్టిన పనుల్లో విజయాలు లభించనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆదివారం గ్రహగతులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

నవంబర్ 29 రాశి ఫలాలు: వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి, వివాహ యోగం
Today Horoscope 29 Nov 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 29, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 29, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృషభ రాశి వారు కుటుంబ వ్యవహారాలు, సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకా లంలో పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. అనారోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగుల సమర్థతకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు. దైవకార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఆభరణాలు, వస్తు వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలు, సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులు ప్రాధాన్యం, ప్రాబల్యం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొన్ని సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకోకుండా ఒక శుభ వార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ప్రయ త్నాలు సానుకూలపడతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవం తమవుతుంది. పెండింగ్ పనులన్నిటినీ కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తు లతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబసభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇంతవరకూ వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలవుతాయి. సర్వత్రా మాటకు విలువ పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో కొద్దిపాటి ఒత్తిడి తప్పకపోవచ్చు. ముఖ్యంగా అధికారుల వల్ల పనిభారం పెరుగు తుంది. సహోద్యోగుల సహాయంతో లక్ష్యాలను పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మిత్రుల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. కొద్దిగా పని ఒత్తిడి ఉన్నా అధికారుల ఆదరణ ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫ లమవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనుకోకుండా కొన్ని శుభ వార్తలు వింటారు. ధన యోగం పట్టే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితంహ్యాపీగా సాగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. బంధుమిత్రులకు సహాయ సహ కారాలు అందిస్తారు. మొండి ధైర్యంతో కొన్ని వ్యవహారాలు చక్కబెడతారు. భాగస్వామ్య వ్యాపా రంలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. వస్తు వాహన లాభాలు పొందుతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆధ్యా త్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. పిల్లలకు సంబంధించి విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు చిన్నపాటి సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ బాధ్యతల్ని సంతృప్తికరంగా నెరవేరుస్తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వ్యయ ప్రయాసలున్నప్పటికీ ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. పిల్ల లకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొందరు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గుతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

Follow Us