
Janardhan Veluru
Executive Editor (Digital), Current Affairs, Politics - TV9 Telugu
janardhan.veluru@tv9.comతెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 1999లో ఈనాడు దినపత్రికతో జర్నలిజంలో అడుగుపెట్టాను. 2004 నుంచి సిఫీ.కామ్, విస్సా టీవీ, రాజ్ న్యూస్ తెలుగు, మనం డైలీ, న్యూస్18.కామ్ వంటి ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థల్లో సీనియర్ స్థాయిలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించాను. 2021 మార్చి నుంచి టీవీ9 తెలుగు (డిజిటల్)లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
పెళ్లింట విషాదం.. స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి
మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించిన ఓ యువతి కాసేటికే విగత జీవిగా మారింది. స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.
- Janardhan Veluru
- Updated on: Feb 9, 2025
- 11:14 pm
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. నలుగురు అరెస్ట్..?
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ సిట్ నలుగురు నెయ్యి సరఫరాదారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఉన్న వీరిని సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. AR డయిరీ ఏండీ రాజశేఖరన్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన డయిరీ నిర్వాహకులను సిట్ అదుపులోకి ఉన్నారు.
- Janardhan Veluru
- Updated on: Feb 9, 2025
- 10:51 pm
AAP పతనం మొదలయ్యింది.. ప్రశాంత్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఆప్ పరాజయంపై ఆ పార్టీ మాజీ నేత ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ ఓటమికి కేజ్రీవాలే కారణమని ఆరోపించిన ఆయన.. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమితో ఆప్ పతనం మొదలయ్యిందని వ్యాఖ్యానించారు.
- Janardhan Veluru
- Updated on: Feb 9, 2025
- 10:23 pm
Maha Kumbh Mela: మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. షెడ్యూల్ ఖరారు
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహా కుంభమేళాలో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10న ఆమె ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్నానం ఆచరిస్తారని రాష్ట్రపతి భవన్ ఆదివారంనాడు విడుదల చేసిన ఓ ప్రటకలో తెలిపింది. అనంతరం స్నానిక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
- Janardhan Veluru
- Updated on: Feb 9, 2025
- 10:27 pm
Watch: ప్రతిపక్ష నేత హోదా.. జగన్ – చంద్రబాబు మధ్య డైలాగ్ వార్
YS Jagan vs Chandrababu Naidu Dialogue War: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాననే భయంతోనే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు మాజీ సీఎం జగన్. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభలో ప్రజా గళాన్ని వినిపించలేమని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావడం లేదంటూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు.
- Janardhan Veluru
- Updated on: Feb 8, 2025
- 6:58 pm
Watch: అందుకే ఢిల్లీలోనూ ఏపీ మాదిరి ఫలితాలు.. ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు
Delhi Election 2025 Results: ఢిల్లీలో కమలం వికసించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఈ గ్రాండ్ విక్టరీ వెనక మాస్టర్ మైండ్ స్ట్రాటజీ అమలు చేసింది బీజేపీ అధిష్ఠానం. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతలు అప్పగించింది. ఆప్ కంచుకోటలను బద్ధలు కొట్టింది.
- Janardhan Veluru
- Updated on: Feb 8, 2025
- 6:44 pm
Watch: ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల తెలంగాణకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారును కోరుకుంటూ ప్రజలు ఈ రకమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. పార్టీ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు శుభాకాంక్షలు తెలిపారు.
- Janardhan Veluru
- Updated on: Feb 8, 2025
- 6:19 pm
Railway Budget 2025: రైల్వే బడ్జెట్ రూ. 2.65 లక్షల కోట్లు.. సామాన్య ప్రయాణీకుల కోసం కీలక ప్రకటన
Railway Budget 2025: భారతీయ రైల్వేలు దేశానికి జీవనాడి. బడ్జెట్‌లో రైల్వేకు సంబంధించి భారీ ప్రకటనలు వస్తాయని భావించారు. కానీ ఈసారి రైల్వే బడ్జెట్‌లో ప్రభుత్వం ఎలాంటి ప్రధాన ప్రకటనలు చేయలేదు. రైల్వే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఏయే అంశాలకు ప్రాధాన్యమిచ్చింది..? ఎలాంటి కీలక కేటాయింపులు చేసిందో తెలుసుకుందాం..
- Janardhan Veluru
- Updated on: Feb 1, 2025
- 6:14 pm
Tirumala: తిరుమలలో TTD చైర్మన్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు కీలక సూచనలు
Tirumala News: తిరుమలలోని బూందీపోటు, పరకామణి భవనంలో శనివారం టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరకామణి భవనంలో హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏవిధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు. పరకామణి భవనంలో సిసి టివి నిఘా, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
- Janardhan Veluru
- Updated on: Feb 1, 2025
- 5:13 pm
Defence Budget 2025: రక్షణ రంగానికి రూ. 6.81 లక్షల కోట్లు.. గతేడాది కంటే ఎంత పెరిగిందంటే?
India Defence Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో రక్షణ శాఖకు రూ.6,81,210 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రక్షణ శాఖకు కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గతేడాది రక్షణ శాఖకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6,21,940 కోట్లు కేటాయించింది.
- Janardhan Veluru
- Updated on: Feb 1, 2025
- 4:50 pm
Delhi Polls 2025: నీరు, విషం, మద్యం.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కీలక అంశాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం చివరి ఘట్టానికి చేరింది. మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో నీరు, విషం, మద్యంతో పాటు ఉచిత హామీలు, శీష్ మహాల్ అంశాలు కీలకంగా మారాయి. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించి.. 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
- Janardhan Veluru
- Updated on: Jan 31, 2025
- 1:01 pm
Pawan Kalyan: జన సైనికులకు పవన్ బహిరంగ లేఖ.. అలా చేయొద్దంటూ వినతి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కొన్నేళ్లైనా ఏపీకి ముఖ్యమంత్రి చేయాలంటూ కొందరు జనసేన నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ పవన్ అభిమానులు ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులనుద్దేశించి పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు.
- Janardhan Veluru
- Updated on: Jan 26, 2025
- 11:25 pm