యుద్దం వేళ భారతదేశంలో ప్రత్యక్షమైన ఇరాన్ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి.. ఎందుకో తెలుసా?
యుద్ధంతో తల్లడిల్లుతున్న ఇరాన్ నేతలు భారతదేశంలో పర్యటించడం ఆసక్తిని రేపుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో జరిగిన ఖమేనీ సంస్మరణ సభకు ఆ దేశ మంత్రి సయ్యద్ ఖతీబ్‌జాదా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా , ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించారు.

యుద్ధంతో తల్లడిల్లుతున్న ఇరాన్ నేతలు భారతదేశంలో పర్యటించడం ఆసక్తిని రేపుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో జరిగిన ఖమేనీ సంస్మరణ సభకు ఆ దేశ మంత్రి సయ్యద్ ఖతీబ్‌జాదా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా , ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించారు.
యుద్ధంలో భారత్ తటస్థంగా ఉంది. అటు అమెరికా , ఇజ్రాయెల్‌తో , ఇటు ఇరాన్‌తో ఈ క్లిష్ట సమయంలో మంచి సంబంధాలను కొనసాగిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంతాప సభ దేశ రాజధాని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరాన్ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి సయ్యద్ ఖతీబ్‌జాదా హాజరయ్యారు. యుద్దం జరుగుతున్న వేళ ఇరాన్ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు భారత పార్లమెంటు సభ్యులు, దౌత్యవేత్తలు కూడా పాల్గొన్నారు.
ఢిల్లీలో జరిగిన రైసీనా డైలాగ్‌కు కూడా సయ్యద్ ఖతీబ్‌జాదా హాజరయ్యారు. అనంతరం విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో ఇరాన్ మంత్రి సయ్యద్ ఖతీబ్‌జాదా ఆయన సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితిపై చర్చించారు. తమపై అమెరికా , ఇజ్రాయెల్ బలగాలను అనవసరంగా దాడి చేశాయని అన్నారు ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి ఖతీబ్‌జాదా. ఆత్మగౌరవం కోసం ఇరాన్ బలగాలు పోరాడుతున్నాయన్నారు. యుద్దాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరాన్ మంత్రి.
#WATCH | "…President Trump is asking for a leadership change in Iran, while he can't even appoint the mayor of New York…Can you imagine this colonial approach? While he would like to see democracy at home, he would like to topple the democratically elected president of… pic.twitter.com/BiBGAITtfZ
— ANI (@ANI) March 6, 2026
న్యూయార్క్ మేయర్ మమ్దానీ గెలుపు డోనాల్డ్ ట్రంప్‌నకు ఇష్టం లేనప్పటికీ అక్కడి ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. మమ్దానీని తొలగించే ధైర్యం ట్రంప్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఇరాన్ కొత్త నాయకత్వాన్ని తామే నిర్ణయిస్తామని ట్రంప్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇరాన్ నాయకత్వం పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు ఖతీబ్‌జాదా.. శ్రీలంక తీరంలో తమ నౌకను పేల్చేసి అమెరికా క్షమించరాని నేరం చేసిందన్నారు. తమ మిత్ర దేశంలో విన్యాసాల్లో పాల్గొని వస్తున్న నిరాయుధులైన నావికులను అన్యాయంగా చంపేశారని మండిపడ్డారు.
#WATCH | Delhi: On the sinking of the Iranian warship, Dr Saeed Khatibzadeh, Deputy Minister of Foreign Affairs of the Islamic Republic of Iran, says, "This is a very sad, very unfortunate incident. That vessel was by invitation of our Indian friends, attending an international… pic.twitter.com/zHs6Vf5GkV
— ANI (@ANI) March 6, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
