AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GATE స్కోర్‌తో నేరుగా ISROలో ఉద్యోగం చేసే ఛాన్స్.. ఎలాంటి రాత పరీక్ష లేదు! డైరెక్ట్ లింక్ ఇదిగో

ISROలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖకు చెందిన ఐఎస్‌ఆర్‌వో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ICRB) భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద సైంటిస్ట్, ఇంజినీర్ 'ఎస్సీ' పోస్టుల భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఈ కింది డైరెక్ట్ లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..

GATE స్కోర్‌తో నేరుగా ISROలో ఉద్యోగం చేసే ఛాన్స్.. ఎలాంటి రాత పరీక్ష లేదు! డైరెక్ట్ లింక్ ఇదిగో
ISRO Scientist Engineer Recruitment
Srilakshmi C
|

Updated on: Aug 06, 2026 | 3:02 PM

Share

ప్రతిష్ఠాత్మక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో ఉద్యోగం సాధించాలని కలలు కనే ఇంజినీరింగ్ అభ్యర్థులకు అద్భుత అవకాశం వచ్చింది. భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖకు చెందిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ICRB) ద్వారా సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్సీ’ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో మొత్తం 92 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే GATE స్కోర్ ఆధారంగా ఈ పోస్టులకు పెంపిక చేస్తారు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • ఎలక్ట్రానిక్స్ విభాగంలో పోస్టుల సంఖ్య: 34
  • మెకానికల్ విభాగంలో పోస్టుల సంఖ్య: 26
  • కంప్యూటర్ సైన్స్ విభాగంలో పోస్టుల సంఖ్య: 13
  • సివిల్ విభాగంలో పోస్టుల సంఖ్య: 10
  • ఎలక్ట్రికల్ విభాగంలో పోస్టుల సంఖ్య: 4
  • రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 2
  • ఆర్కిటెక్చర్ విభాగంలో పోస్టుల సంఖ్య: 2
  • సివిల్ (PRL) విభాగంలో పోస్టుల సంఖ్య: 1

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ లేదా సమాన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్ 17, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.250 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎలాంటా రాత పరీక్ష ఉండదు. కేవలం గేట్ స్కోర్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున ప్రారంభ వేతనంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అందిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇస్రోలో సైంటిస్ట్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!
18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!
18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!
ఇక రచ్చ రచ్చే.. బిగ్‏బాస్ 10లోకి సీరియల్ హీరోయిన్..
ఇక రచ్చ రచ్చే.. బిగ్‏బాస్ 10లోకి సీరియల్ హీరోయిన్..
నేపాల్‌‌లో వరదలు.. బాలెన్‌షాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌
నేపాల్‌‌లో వరదలు.. బాలెన్‌షాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త
నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉంటే వెంటనే ఆపేయండి!
నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉంటే వెంటనే ఆపేయండి!