Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ తెలుగు

బిగ్ బాస్ తెలుగు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9పై సర్వత్రా ఆసక్తినెలకొంటోంది. బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ 9వ సీజన్‌ హోస్ట్, కంటెస్టెంట్స్‌కు సంబంధించిన పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. బీబీ సీజన్ 9కి సంబంధించిన సన్నాహాలను స్టార్ మా నిర్వాహకులు ఇప్పటికే మొదలుపెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. సీజన్ 9కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తారని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 1కి జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2కి నాని హోస్ట్‌గా వ్యవహరించారు. సీజన్ 3 నుంచి సీజన్8 వరకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. సీజన్ 9కి కూడా హోస్ట్‌గా ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటివరకు వచ్చిన సీజన్స్ కు భిన్నంగా ఈ సీజన్ 9 ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  దీంతో బీబీ సీజన్ 9పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది. సీజన్ 9లో కొత్త నిబంధనలు, కొత్త గేమ్స్‌తో మరింత ఆసక్తికరంగా.. వినూత్నంగా ఉండేలా ఉంటుందని స్టార్ మా వర్గాలు చెబుతున్నాయి. కాగా ఎలాంటి అంచనాలు లేకుండా రైతు బిడ్డగా హౌజ్‌లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్‌గా నిలవడం తెలిసిందే. టీఆర్పీ పరంగా బిగ్‌బాస్ సీజన్ 7 పాత రికార్డులను తిరగరాసింది. ఆతర్వాత సీజన్ 8 లో నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. ఈ సీజన్  కూడా మంచి టీఆర్పీ దక్కించుకుంది. దీంతో బీబీ సీజన్ 9పై కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది.

ఇంకా చదవండి

Shobha Shetty:పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పూజలు చేసిన బిగ్ బాస్ ఫేమ్ శోభాశెట్టి.. కారణమిదేనట

బిగ్ బాస్ షో రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కన్నడ బ్యూటీ శోభా శెట్టి కూడా ఒకరు. ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆమె తన ఆట, మాటతీరుతో ఫైర్ బ్రాండ్ గా ఫేమస్ అయ్యింది.

Adi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డి సోదరి గొప్ప మనసు.. కంటి చూపులేకపోయినా తన పెన్షన్ డబ్బులను విరాళంగా ఇచ్చి మరీ..

బిగ్ బాస్ ఫేమ్ ఆది రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 6 లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన అతను తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. మరి ఆది రెడ్డికి కంటి చూపు లేని ఒక సోదరి ఉందనే విషయం తెలుసా?

Bigg Boss: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో బిగ్ బాస్ తెలుగు విన్నర్! వీడియోలు రిలీజ్ చేసిన అన్వేష్‌.. కేసు నమోదు!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తోన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే సన్నీ యాదవ్, హర్షసాయి వంటి ఫేమస్ యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే విషయంలో బిగ్ బాస్ తెలుగు విన్నర్ పై కూడా కేసు నమోదు కానుందని తెలుస్తోంది.

Bigg Boss: ప్రియుడితో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్న బిగ్ బాస్ తెలుగు బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా? వీడియో

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ రంగుల పండగలో మునిగి తేలుతున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా హోలీ వేడుకల్లో భాగమవుతున్నారు. అలా తాజాగా ఓ బుల్లితెర నటి తన ప్రియుడితో కలిసి హోలీ సంబరాలు జరుపుకొంది.

Bigg Boss Telugu: పెళ్లిపీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ ! మంగళ స్నానం వీడియో వైరల్

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఈ కన్నడ బ్యూటీ కూడా ఒకరు. ఎనిమిదో సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించంది. అలాగే తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది.

Deepthi Sunaina : కాశీకి వెళ్లి శివయ్య టాటూ వేయించుకున్న దీప్తి సునైనా.. ఫొటోస్ ఇదిగో

ప్రస్తుతం దేశమంతా ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలుతోంది. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళుతున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగమవుతున్నారు. బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా కూడా ఆధ్యాత్మియ యాత్రలతో బిజీగా ఉంటోంది.

Mehaboob Dil Se: ‘మా జీవితంలో కొత్త ఆధ్యాయం మొదలైంది’.. గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌ దిల్‌సే

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మెహబూబ్ దిల్ సే ఒకడు. ప్రైవేట్ సాంగ్స్ తో ఫేమస్ యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న అతను బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మరింత క్రేజ్, పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.

Tollywood: ఓం నమః శివాయ.. అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్న టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్

ప్రస్తుతం దేశమంతా ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలుతోంది. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే క్రమంలో వారణాసి, అయోధ్య, కాశీ వంటి పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. అలాతాజాగా ఓ టాలీవుడ్ నటి అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంది. అనంతరం ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.

Shekar Basha: బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు.. ఫిర్యాదు చేసిన శ్రేష్టి వర్మ.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ ఫేమ్ ఆర్ జే శేఖర్ బాషా పై మరో కేసు నమోదైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ అతనిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శేఖర్ బాషాపై కేసు నమోదు చేశారు. కొన్ని నెలల ముందు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై శ్రేష్టి వర్మ ఫిర్యాదు చేసింది.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో బిగ్ బాస్ బ్యూటీ.. నెటిజన్లతో చీవాట్లు.. ఏమైందంటే? వీడియో

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళాకు సినీ తారలు తరలి వెళుతున్నారు. అక్కడి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం తమ ఆధ్యాత్మిక యాత్రలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.