Bigg Boss Emmanuel: బిగ్ బాస్ ఓటమిని తలుచుకొని.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ విన్నర్‌గా నిలవలేకపోవడంపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. కమెడియన్లు ఎందుకు గెలవరని ప్రశ్నించారు. ఆట బాగా ఆడితే గెలుస్తారన్న నమ్మకం కోల్పోయానన్నారు. గెలవలేదని బాధలేదు కానీ, తన కోసం ఊరూరా ప్రచారం చేసిన తల్లిదండ్రుల త్యాగం తలచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సంఘటన బిగ్ బాస్ పై ఆయన అభిప్రాయాన్ని మార్చివేసింది.
బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అనుకున్న జబర్డస్త్ ఇమ్మాన్యుయేల్.. వెరీ షాకింగ్‌గా.. విన్నర్ అవకుండానే బయటికి వచ్చేశాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ట్రోఫీ తనకు దక్కకపోవడంపై పలు సందర్భాల్లో నార్మల్‌గా రియాక్టైన ఇమ్మూ.. రీసెంట్‌గా ఓ షో లో మాత్రం బ్లాస్ట్ అయ్యాడు. అసలు.. కమెడియన్లను విన్నర్‌గా ఎందుకు చూడరంటూ అందర్నీ ఎమోషనల్‌గా ప్రశ్నించాడు. గేమ్స్ బాగా ఆడితే ఎవరైనా విన్నర్ అవుతారనే నమ్మకం తనకుండేదని.. కానీ బిగ్ బాస్ షో చూశాక.. తన నమ్మకం పోయిందంటూ ఇమ్మూ చెప్పుకొచ్చాడు. అలా అని ఓడిపోయినందుకు కొంచెం కూడా బాధపడలేదని.. కానీ తన తల్లిదండ్రులు..క్యారేజీ కట్టుకుని బైక్‌పై 90 ఊర్లు తిరిగారని.. తనకు ఓటేయమని పాంప్లెట్లు పంచారని.. ఆ విషయం గుర్తు తెచ్చుకుంటూనే తనకు కన్నీళ్లు ఆగడం లేదన్నాడు ఇమ్మూ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైమ్ తీసుకుంటున్న టాప్ స్టార్స్… ఈ గ్యాప్ మంచిదేనా
Zombie Reddy 2: త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న జాంబీ రెడ్డి సీక్వెల్
బడ్జెట్ రికార్డులు బ్రేక్ చేస్తున్న సంజయ్ లీలా భన్సాలి
Tamannaah Bhatia: బిజినెస్ పాఠాలు చెబుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

