AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోలకు షాక్ ఇస్తున్న అందాల భామలు

హీరోలకు షాక్ ఇస్తున్న అందాల భామలు

Samatha J
|

Updated on: Aug 12, 2026 | 2:52 PM

Share

ఒకప్పుడు గ్లామర్ పాత్రలకే పరిమితమైన హీరోయిన్స్ ఇప్పుడు రూట్ మార్చారు. యాక్షన్, మాస్, నెగటివ్ షేడ్స్‌తో హీరోలనే డామినేట్ చేస్తున్నారు. వామికా గబ్బి, రుక్మిణీ వసంత్ వంటి నటీమణులు తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లతో వెండితెరపై కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ, శక్తివంతమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ సాంగ్స్‌కే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు సినిమా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నేటితరం నటీమణులు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, యాక్షన్, మాస్ పెర్ఫార్మెన్స్‌లతో పాటు విలనిజంలోనూ దుమ్ము రేపుతూ, ఏకంగా హీరోలనే డామినేట్ చేస్తున్నారు. నేషనల్ లెవెల్‌లో సంచలనం సృష్టించిన అనేక చిత్రాల్లోనూ ఈ హీరోయిన్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.దీనికి ఒక ఉదాహరణ వామికా గబ్బి. సుధీర్ బాబు హీరోగా నటించిన భలే మంచి రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వామికా, తన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హిందీ, పంజాబీ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. సిల్వర్ స్క్రీన్‌పైనే కాదు, వెబ్ సిరీస్‌లలోనూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన డీసీ సినిమాతో వామికా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రంలో చంద్ర అనే శక్తివంతమైన పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. కొన్ని సన్నివేశాల్లో లోకేష్ కనగరాజ్‌ను కూడా వామికా డామినేట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్: ఇప్పటివరకు ఓటేసింది 20 మందే..

రాకింగ్ స్టార్ యశ్ మాస్టర్ ప్లాన్

మహేష్‌ ఫ్యాన్స్‌ను మోసం చేసిన రాజమౌళి!

అవతార్‌ను బీట్ చేస్తున్న రామాయణ.. ఏ విషయంలో?

Follow Us