టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్: ఇప్పటివరకు ఓటేసింది 20 మందే..
టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికలు మందకొడిగా సాగుతున్నాయి. అధ్యక్షురాలు సుమలత వర్గం, ఫెడరేషన్ మధ్య విభేదాలు కొనసాగుతుండటంతో చాలామంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఖాళీగా ఉన్న జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్ల భాగస్వామ్యం తక్కువగా ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్ మందకొడిగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు చాలా తక్కువ మంది సభ్యులు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వర్గం, ఫెడరేషన్ మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా ఒక వర్గం ఎన్నికలను బహిష్కరించింది.2025 డిసెంబర్‌లో సుమలత అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత అసోసియేషన్ వ్యవహారాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జూలైలో జరిగిన జనరల్ బాడీ సమావేశం సందర్భంగా పరిపాలన, ఎన్నికల ప్రక్రియ, ఆర్థిక వ్యవహారాలపై ఆరోపణలు రావడంతో 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, ఎనిమిది ఈసీ మెంబర్స్ పదవులకు ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.ఫెడరేషన్ జోక్యం అవసరం లేదని సుమలత వర్గం చెబుతుండగా, ఫెడరేషన్ మాత్రం అనుబంధ యూనియన్లకు తన నిర్ణయాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

