బట్టల దుకాణంలో వీధికుక్కలకు ఆశ్రయం.. యజమాని పెద్ద మనసుకు నెటిజన్లు ఫిదా
వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయ సమీపంలో ఒక చీరల దుకాణం యజమాని వీధికుక్కలకు ఆశ్రయం కల్పించి అందరినీ ఆకట్టుకున్నాడు. దుకాణంలో కస్టమర్ల లాగే హాయిగా నిద్రిస్తున్న కుక్కలను చూసి ఒక ట్రావెల్ వ్లాగర్ వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాపారం కంటే మూగజీవాల రక్షణే ముఖ్యమంటూ ఆయన ఇచ్చిన సమాధానం నెటిజన్లను ఎంతగానో కదిలించింది.
వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయ సమీపంలో ఉన్న ఒక చీరల దుకాణం యజమాని నిస్వార్థ సేవ, దయతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన తన దుకాణంలో వీధి కుక్కలకు ఆశ్రయం కల్పిస్తూ, వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. ఈ అరుదైన దృశ్యం ఒక ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ కంటపడటంతో, అతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో, దుకాణం లోపల వీధి కుక్కలు ఎలాంటి ఆటంకం లేకుండా హాయిగా నిద్రపోవడం కనిపించింది. కస్టమర్లు వచ్చినప్పుడు కూడా వాటిని బయటకు పంపించరా అని వ్లాగర్ ప్రశ్నించగా, యజమాని ఎంతో వినయంగా “లేదు, రావలాలనుకున్న వాళ్ళు ఎలాగైనా వస్తారు కదా” అని సమాధానం ఇచ్చారు. ఈ మాటలు నెటిజన్లను ఎంతగానో కదిలించాయి. వ్యాపారం దెబ్బతింటుందని ఆలోచించకుండా, మూగజీవాలకు సురక్షితమైన చోటు కల్పించాలన్న ఆయన గొప్ప మనసును అందరూ ప్రశంసించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో యజమాని నిస్వార్థ సేవకు, దయాగుణానికి నిదర్శనంగా నిలిచింది. ఎలాంటి గొప్పలు చెప్పుకోకుండా, చాలా సాధారణంగా ఆయన చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పురుషుల డైట్ సీక్రెట్! 20, 40, 60 – ఏ వయసులో ఏం తినాలో తెలుసా?
NEFT ద్వారా రోజులో ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు?..ఆర్బీఐ రూల్స్ ఇవే
Ram Charan: స్టెరాయిడ్స్ లేవు.. ఇంజెక్షన్స్ లేవు.. శాఖాహార భోజనంతో వండర్స్!
ఒకప్పుడు సురేఖమ్మ దగ్గర 5వేల అప్పు ఇప్పుడు కోట్లలో ఆస్తులు!
కర్నూలు థియేటర్‌లో రహస్య కెమెరాలు.. కొత్త సినిమా వచ్చిందంటే యథేచ్ఛగా లీకే
బట్టల దుకాణంలో వీధికుక్కలకు ఆశ్రయం.. యజమాని పెద్ద మనసు
ఇతను కదా.. అసలైన ఓటరు అంటే
రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..
చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే

