కిడ్నీ ఇచ్చి భార్యకు పునర్జన్మ…చివరకు రోడ్డు ప్రమాదంలో విషాదం!

×

కిడ్నీ ఇచ్చి భార్యకు పునర్జన్మ…చివరకు రోడ్డు ప్రమాదంలో విషాదం!

కర్ణాటకకు చెందిన వీణాబాయి (38) అనే మహిళకు ఆరేళ్ల క్రితం బీపీ కారణంగా రెండు కిడ్నీలు పాడయ్యాయి. డయాలసిస్ సైతం సరిపోదని, వెంటనే కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. కిడ్నీ దాతలు దొరకడం కష్టమైన నేపథ్యంలో, భర్త శివాజీరావుకు ఆమె కిడ్నీ మ్యాచ్ అయింది. ఎటువంటి ఆలోచన లేకుండా శివాజీరావు తన భార్యకు కిడ్నీ దానం చేసి, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. కిడ్నీ మార్పిడి తర్వాత వీణాబాయి కోలుకుని, కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే, ఇటీవల ఈ దంపతులు సిద్ధగంగా మఠం నుంచి బైక్‌పై తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ వారి బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడిపోయారు. భార్య వీణాబాయిపై నుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. తన కళ్ల ముందే ప్రాణం పోసిన భార్య విగతజీవిగా మారడం శివాజీరావుకు తీరని వేదన మిగిల్చింది. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Phani CH