AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాకు రక్షణ కల్పించండి మహాప్రభో..తమిళనాడులో పురుషుల డిమాండ్

మాకు రక్షణ కల్పించండి మహాప్రభో..తమిళనాడులో పురుషుల డిమాండ్

Phani CH
|

Updated on: Nov 22, 2026 | 7:13 PM

Share

తమిళనాడులో పురుషులు తమకు కూడా మహిళల తరహాలోనే ప్రభుత్వ రక్షణ, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ పురుషుల దినోత్సవం సందర్భంగా తమిళనాడు పురుషుల భద్రత సంఘం ఈ విజ్ఞప్తి చేసింది. వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాల కారణంగా పురుషుల బలవన్మరణాలు పెరుగుతున్నాయని, దీనిని అరికట్టేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్, కఠిన చట్టాలు అవసరమని కోరింది.

తమిళనాడులో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన డిమాండ్ తెరపైకి వచ్చింది. మహిళల తరహాలోనే తమకు కూడా ప్రభుత్వం నుంచి తగిన రక్షణ, భద్రత కల్పించాలని పురుషులు గళం విప్పుతున్నారు. ప్రపంచ పురుషుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడు పురుషుల భద్రత సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విధంగానే, బాధిత పురుషుల కోసం కూడా ప్రత్యేక హెల్ప్‌లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని దీనివల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అక్రమ సంబంధాలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు పెట్టుకునే పురుషులు, మహిళలు ఇద్దరికీ కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలను కొందరు తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారని తమిళనాడు పురుషుల భద్రత సంఘం ఆరోపించింది. అలాంటి తప్పుడు కేసులు, వేధింపుల బారి నుంచి అమాయకులైన పురుషులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. కుటుంబ కలహాలు, భార్యల వేధింపులను తట్టుకోలేక తమిళనాడు వ్యాప్తంగా ఏటా సుమారు 10,000 మంది పురుషులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని సంఘం గణాంకాలతో సహా ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే మహిళలకు ఉన్నట్టే పురుషుల భద్రతకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి, వారికి న్యాయం చేయాలని సంఘం ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుపతిలో మరో కొత్త నగరం.. అలిపిరి వద్ద రూ.2,750 కోట్లతో మెగా టౌన్‌షిప్

ఏపీలో 2,111 టీచర్ పోస్టులు..సబ్జెక్టుల వారీగా పోస్టుల లిస్ట్..ఇలా దరఖాస్తు చేసుకోండి

Hyderabad: హైదరాబాద్ ఆకాశంలో ఉల్కాపాతం.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యాలు

Published on: Nov 22, 2026 07:11 PM
Follow Us