AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NHAI: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు భారీగా ఫైన్!

NHAI: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు భారీగా ఫైన్!

Phani CH
|

Updated on: Nov 21, 2026 | 3:50 PM

Share

వాహనదారులకు NHAI కొత్త అలర్ట్ ఇచ్చింది. ఇకపై టోల్ ప్లాజాల వద్దే వాహనాల ఇన్సూరెన్స్ వివరాలను ఆటోమేటిక్‌గా తనిఖీ చేసే విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. పాలసీ గడువు ముగిసిన వాహన యజమానులకు SMS ద్వారా హెచ్చరికలు పంపనుంది. ఇన్సూరెన్స్ లేకుండా ప్రయాణిస్తే రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా పడే అవకాశం ఉంది.

రోడ్డుపై వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఎంత ముఖ్యమో.. ఇన్సూరెన్స్ కూడా అంతే ముఖ్యం. కానీ చాలామంది పాలసీ గడువు ముగిసినా పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతుంటారు.. ఇక అలాంటి వాహనాలకు చెక్ పెట్టేందుకు కొత్త విధానాన్ని తీసుకొస్తోంది NHAI.. టోల్ ప్లాజా దాటగానే మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అన్నది ఆటోమేటిక్‌గా గుర్తించే వ్యవస్థను ప్రారంభించింది.. ప్రస్తుతం ఢిల్లీలోని ముండ్కా టోల్ ప్లాజా దగ్గర పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.. టోల్ దాటే సమయంలో వాహనం నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి.. వాహన్ డేటాబేస్‌లోని ఇన్సూరెన్స్ వివరాలతో సరిపోల్చుతారు.. పాలసీ గడువు ముగిసినట్లు గుర్తిస్తే.. వాహన యజమాని రిజిస్టర్డ్ మొబైల్‌కు SMS అలర్ట్ పంపిస్తారు.. ఇన్సూరెన్స్ వెంటనే రెన్యువల్ చేసుకోవాలని హెచ్చరిస్తారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం.. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మొదటిసారి రూ.2 వేల వరకు.. రెండోసారి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.. కోర్టు కేసు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ విధానం విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఇతర టోల్ ప్లాజాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇక హైవేలపై అక్రమ పార్కింగ్‌లు.. ధాబాలు.. ఆక్రమణలపైనా NHAI చర్యలకు సిద్ధమవుతోంది.. దేశవ్యాప్తంగా 595 అక్రమ పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి తొలగించేందుకు అధికారులతో కలిసి పనిచేస్తోంది.. సో.. హైవేపై వెళ్లే ముందు మీ వాహనం ఇన్సూరెన్స్ గడువు ఒకసారి చెక్ చేసుకోండి.. లేదంటే జరిమానా ముప్పు తప్పకపోవచ్చు!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

New Building Rules: బిల్డింగ్ రూల్స్‌ మారుతున్నాయ్‌..ఇల్లు కట్టుకోవడం ఇక ఈజీ..

Samantha: గాయత్రీ హోమ ఫలితం.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సమంత

సోయి లేకుంటే ఎలా.. అడ్డంగా మోసపోయింది..!

Nayanthara: నా జీవితంపై డాక్యుమెంటరీ ఎందుకు తీయకూడదు.. విమర్శకులకు నయన్ కౌంటర్!

Ramya Krishnan: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ ఉంది.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Follow Us