AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండగ పేరుతో విచ్చలవిడి ఖర్చులు! ఈ తప్పు మీరూ చేస్తున్నారా?

పండగ పేరుతో విచ్చలవిడి ఖర్చులు! ఈ తప్పు మీరూ చేస్తున్నారా?

Phani CH
|

Updated on: Nov 15, 2026 | 12:14 PM

Share

పండగ షాపింగ్, ఆఫర్లు, క్రెడిట్ కార్డ్ ఖర్చులతో మీ నెలవారీ బడ్జెట్ దెబ్బతిందా? పండగ తర్వాత వచ్చే ఆర్థిక ఒత్తిడినే ఫెస్టివల్ స్పెండింగ్ హ్యాంగోవర్ అంటారు. ఖర్చుల లెక్కలు రాసుకోవడం, అనవసర కొనుగోళ్లు తగ్గించడం, క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం, బడ్జెట్‌ను తిరిగి ప్లాన్ చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

పండగ వచ్చిందంటే చాలు.. కొత్త బట్టలు, ఆభరణాలు, గిఫ్ట్‌లు, ఆన్‌లైన్ సేల్స్‌లో అదిరిపోయే డిస్కౌంట్లు అని చెప్పి మనం లెక్కలేనంత ఖర్చు పెట్టేస్తాం. పండగ రోజుల్లో ఆ కిక్కే వేరు బాసూ! కానీ పండగ అయిపోయిన తర్వాత వచ్చే క్రెడిట్ కార్డ్ బిల్లులు, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది. దీన్నే మనం ‘ఫెస్టివల్ స్పెండింగ్ హ్యాంగోవర్’ అంటాం. చాలామంది పండగ సమయంలో తమ నెలవారీ బడ్జెట్‌ను పూర్తిగా పక్కన పెట్టి మరీ ఖర్చు చేస్తారు. కొంతమంది అయితే సేవింగ్స్ తీయడమే కాకుండా, క్రెడిట్ కార్డులు, ఈఎంఐల మీద విపరీతంగా అప్పులు చేస్తారు. పండగ అయిపోయాక వచ్చే నెలల్లో కరెంట్ బిల్లులు, రెంట్, పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి చేతిలో డబ్బులు లేక సతమతమవుతుంటారు. ఈ ఆర్థిక ఇబ్బందులే మిమ్మల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. అందుకే, ఈ హ్యాంగోవర్ నుంచి వీలైనంత త్వరగా బయటపడటం చాలా ముఖ్యం. మరి మీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలంటే ఏం చేయాలి? అంటే నెంబర్‌ 1.. ఖర్చుల బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోండి. ఈ పండగ సీజన్‌లో మీరు అసలు ఎంత ఖర్చు పెట్టారు? క్రెడిట్ కార్డుల ద్వారా ఎంత అప్పు అయింది? అనే పూర్తి వివరాలను ఒకచోట రాసుకోండి. వాస్తవాన్ని అంగీకరించడమే మొదటి మెట్టు. నెంబర్‌ 2.. ‘నో-స్పెండింగ్’ రూల్ పాటించండి. వచ్చే కొన్ని వారాల పాటు అనవసరమైన ఆన్‌లైన్ షాపింగ్‌లు, రెస్టారెంట్లు, బయట తిరగడం పూర్తిగా బంద్ చేయండి. కేవలం అత్యవసరమైన అవసరాలకే డబ్బులు వాడండి. నెంబర్‌ 3.. క్రెడిట్ కార్డ్ బిల్లులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. మీ వద్ద సేవింగ్స్ ఉంటే వాటిలో కొంత భాగం ఉపయోగించి హై-ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డ్ డ్యూస్‌ను క్లియర్ చేయండి. లేదంటే భారీ వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఇక నెంబర్‌ 4.. తదుపరి నెలల బడ్జెట్‌ను రీ-ప్లాన్ చేసుకోండి. రాబోయే రెండు, మూడు నెలల పాటు మీ ఖర్చులను కట్ చేసుకొని, పండగ కోసం వాడిన సేవింగ్స్ మళ్లీ రికవరీ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. పండగ అనేది సంతోషాన్ని ఇవ్వాలి కానీ, ఆ తర్వాత వచ్చే నెలలన్నీ అప్పుల ఊబిలో గడిచేలా చేయకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను ఇప్పుడే సరిదిద్దుకోండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదెక్కడి గోల.. రెండేళ్ల కిందటి కరెంట్ బిల్లు ఇప్పుడు కట్టాలా?

బాసరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి కొత్త రూట్ వచ్చేసింది

రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖ సమ్మిట్ టార్గెట్ ఏంటి?

వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప.. టక్కున దూకేసి.. పట్టేసిన లారీ డ్రైవర్

వందే భారత్ స్లీపర్‌కు నో తత్కాల్‌..నో వెయిటింగ్‌ లిస్ట్‌!

Follow Us