తెలుగమ్మాయికి మెగా ఛాన్స్

×

తెలుగమ్మాయికి మెగా ఛాన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రం RC17కు సంబంధించిన హీరోయిన్‌పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో రామ్ చరణ్ సరసన ఎవరు నటించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఆకాశంలో ఒక తార ఫేమ్ సాత్విక పేరు హీరోయిన్‌గా వినిపించింది. కొన్ని రోజుల పాటు ఈ వార్త వైరల్ అయినా, దీనిపై ఎటువంటి అధికారిక స్పష్టత రాలేదు. తాజా సమాచారం ప్రకారం, ఇప్పుడు మరో తెలుగమ్మాయి గౌరీ ప్రియ పేరు బలంగా వినిపిస్తోంది. RC17 సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్‌గా గౌరీ ప్రియను కూడా చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ సుకుమార్ గౌరీ ప్రియ వైపు మొగ్గు చూపితే, ఆమెకు ఇది ఒక పెద్ద కెరీర్ టర్నింగ్ అవకాశంగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ వంటి స్టార్ హీరో సరసన, సుకుమార్ వంటి అగ్ర దర్శకుడి సినిమాలో నటించడం గౌరీ ప్రియ సినీ ప్రస్థానానికి కీలక మలుపు అవుతుందని భావిస్తున్నారు. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Phani CH