AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖ సమ్మిట్ టార్గెట్ ఏంటి?

రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖ సమ్మిట్ టార్గెట్ ఏంటి?

Phani CH
|

Updated on: Nov 15, 2026 | 11:43 AM

Share

విశాఖపట్నంలో ప్రారంభమైన సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 58 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో 141 ఒప్పందాల ద్వారా రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.46 లక్షల ఉద్యోగ అవకాశాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందాలు కార్యరూపం దాలిస్తే రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు రానుంది.

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. విశాఖపట్నం సాగరతీరం మరోసారి పారిశ్రామిక వేత్తల సందడితో వేడెక్కింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు 58 దేశాల నుంచి దాదాపు 3 వేల 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో 16 మంది విదేశీ మంత్రులు, 40 మంది అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు ఉండటం విశేషం. వివిధ దేశాల దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఇందులో ఉన్నారు. వేదికపై ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మధ్యలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. వీరితో పాటు ఐటీ మంత్రి నారా లోకేశ్ ఆసీనులయ్యారు. వేదిక వద్దకు వెళ్లేటప్పుడు థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలికితే.. పీయూష్ గోయల్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వయంగా డోలు వాయించి సందడి చేశారు. పారిశుద్ధ్య కార్మికులను దగ్గరకు తీసుకుని అభినందించారు. అక్కడితో ఆగలేదు—సదస్సు ప్రారంభానికి ముందే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోకి రాబోతున్న పెట్టుబడుల చిట్టాను లోకేష్.. పవన్ ముందుంచారు. లోకేశ్ చొరవను పవన్ అభినందించారు. ఇదే ఒరవడి కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సమ్మిట్ లో కుదరబోయే ఒప్పందాలెన్ని? వాటి మూలంగా ఏపికీ వచ్చే పెట్టుబడులు ఎన్ని? ఆర్థిక గణాంకాల సంగతేంటి? ఈ వివరాలను చూస్తే.. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం, ఈ సదస్సులో వివిధ సంస్థలతో ఏకంగా 141 ఎంవోయూలు కుదుర్చుకోబోతున్నారు. వీటి ద్వారా రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడుల విలువ అక్షరాలా 12 లక్షల 14 వేల కోట్ల రూపాయలు. తద్వారా 2 లక్షల 46 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మంత్రి లోకేశ్.. మరో అడుగు ముందుకేసి, రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నడుస్తోందని, స్వయంగా పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇక గత ఏడాది సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి అమలుతో సాధించిన ఫలితాలను బేరీజు వేసుకుంటూనే ఈ 2026 సదస్సు లక్ష్యాలను నిర్దేశించామని చెబుతోంది. ఏపీ పెవిలియన్, ఎంఎస్‌ఎంఈ పెవిలియన్‌లను ప్రారంభించి, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌ను డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శించారు. 141 ఒప్పందాల్లో కనీసం 50 నుంచి 60 శాతం గ్రౌండ్ అయినా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం మారిపోతుంది. దానికి భూసేకరణ, పర్యావరణ అనుమతులు, విద్యుత్, నీటి వసతి వంటి మౌలిక సదుపాయాలు ఎంత వేగంగా అందుతాయన్నది ముఖ్యం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం నినాదంగా మిగలకుండా, క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరులో కనిపించాలి. పెట్టుబడిదారుడు తన పెట్టుబడికి ఉన్న భద్రతను చూస్తాడు. ఆ లెక్కన చూస్తే.. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం ఇప్పుడు ఏపీకి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా హాజరై రాష్ట్ర నాయకత్వంతో కలిసి అడుగులేయడం ఇన్వెస్టర్లకు ఒక పాజిటివ్ సిగ్నల్ ఇస్తుంది. విశాఖకు సహజసిద్ధమైన పోర్టు ఉంది, మానవ వనరులు ఉన్నాయి, ప్రశాంతమైన వాతావరణం ఉంది. దీన్ని ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చడానికి ఇది సరైన సమయం. విదేశీ ప్రతినిధులకు, పారిశ్రామిక దిగ్గజాలకు విశాఖ సామర్థ్యాన్ని చూపించడంలో ఈ వేదిక సఫలమైంది. ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చితే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో నిరుద్యోగ సమస్యకు చాలా వరకు చెక్ పెట్టొచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప.. టక్కున దూకేసి.. పట్టేసిన లారీ డ్రైవర్

వందే భారత్ స్లీపర్‌కు నో తత్కాల్‌..నో వెయిటింగ్‌ లిస్ట్‌!

అభిమానాలు లేక కాదు, సందర్భాలు కుదరాలి కదా! దటీజ్ పవన్ నైజం!

ఆయన సంపాదన.. ఈమె పాకెట్ మనీతో సమానమా?

గాడ్ ఆఫ్ వార్’ రూమర్లకు.. నాగవంశీ దిమ్మతిరిగే కౌంటర్..

Follow Us