AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన సంపాదన.. ఈమె పాకెట్ మనీతో సమానమా?

ఆయన సంపాదన.. ఈమె పాకెట్ మనీతో సమానమా?

Phani CH
|

Updated on: Nov 15, 2026 | 11:09 AM

Share

అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం తర్వాత వీరిద్దరి ఆస్తులపై ఆసక్తికర చర్చ మొదలైంది. అనిరుధ్ నికర ఆస్తి రూ.60 కోట్లు కాగా, కావ్య మారన్ వ్యక్తిగత ఆస్తులు రూ.409 కోట్లుగా కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో కావ్య ఆస్తులు అనిరుధ్ కంటే దాదాపు ఏడింతలు ఎక్కువగా ఉన్నాయనే పోలిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐపీఎల్ మ్యాచ్‌లలో కెమెరా కళ్లు ఎప్పుడూ వెతికే కావ్య పాప..తన BGMలతో థియేటర్లను ఊపేసే అనిరుధ్‌! ఈ ఇద్దరూ ఇప్పుడు ఒక్కటయ్యారు. తమ మధ్య పుట్టిన ప్రేమను మూడు ముళ్ల బంధంతో ముందుకు తీసుకెళ్లారు. తమ మధ్య ప్రేమ పుట్టిన గ్రీస్‌ లోనే చాలా గ్రాండ్‌ గా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరి ఆస్తుల మధ్య ఓ ఫన్నీ కంపారిజన్ ఇప్పుడు కోలీవుడ్‌లో మొదలైంది. అనిరుధ్ సంపాదన.. కావ్య పాకెట్ మనీతో సమానమే కామెంట్ ఇప్పుడు నెట్టింట మీమ్‌ మెటీరియల్‌గా కనిపిస్తోంది. అనిరుధ్ – కావ్య! వీళ్లిద్దరి ఆస్తుల మధ్య ఉన్న ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా అయితే ఉంది. ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.ఈ రెమ్యునరేషన్‌తో పాటే రకరకాల బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టి బాగానే సంపాదిస్తున్నాడు. అయినా కానీ.. అనిరుధ్ మొత్తం ఆస్తి విలువ కేవలం రూ. 60 కోట్లు మాత్రమేనని రిపోర్ట్‌. మరోవైపు మన ఆరెంజ్ ఆర్మీ బాస్ కావ్య మారన్ వ్యక్తిగత ఆస్తి విలువ అక్షరాలా రూ. 409 కోట్లని లేటెస్ట్ రిపోర్ట్‌. అంటే అనిరుధ్ కంటే కావ్య దాదాపు ఏడు రెట్లు ఎక్కువ ధనవంతురాలు అన్నమాట.అంతేకాదు సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ ఒక్కగానొక్క కూతురు కావడంతో, ఆయనకున్న రూ. 24,600 కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు ఆమే! తండ్రి వాటా కూడా కలిపితే వేల కోట్లకు అధిపతి కావ్య పాపే. కానీ కావ్య మాత్రం ఎప్పుడూ రిచ్ గర్ల్‌ గా ఫీలవదని కామెంట్. చెన్నైలో బీకామ్, ఇంగ్లాండ్‌లో ఎంబీఏ పూర్తి చేసి, సన్ టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, SRH CEOగా తన స్వయంకృషితోనే ఆమె ఈ స్థాయికి చేరుకుందని అందరూ ఈమెను కొనియాడుతుంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాడ్ ఆఫ్ వార్’ రూమర్లకు.. నాగవంశీ దిమ్మతిరిగే కౌంటర్..

62 ఏళ్ల వయసులో రొమాంటిక్ ఫోజులు.. ప్రియురాలితో గోవిందా వైరల్ పిక్స్!

Follow Us