Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) చరిత్ర సృష్టించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈ సారి విజయం సాధించి సీఎంగా హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉద్యమమే ఊపిరిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. ప్రస్తుత ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. తనకు రూ.58.92 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిడ్‌లో కేసీఆర్ వెల్లడించారు. అయితే తన పేరిట కారు లేదని తెలిపారు.

మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మించారు. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో బీఏ, ఉస్మానియి యూనివర్సిటీలో ఎంఏ (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు. 1969లో శోభను వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఉన్నారు.

తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 70వ దశకంలో యువజన్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రవేశం చేశారు. 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 1983లో తన రాజకీయ గురువు అనంతుల మదన్‌ మోహన్‌(కాంగ్రెస్)పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ.. ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు.

ఇంకా చదవండి

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అట్టహాసంగా ఏర్పాట్లు!

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. బాహుబలి వేదిక.. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా ప్రదర్శనలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్ని విశిష్టతలు ఉండబోతున్నాయని భారతీయ రాష్ట్ర సమితి(BRS) పార్టీ సంకేతాలు ఇస్తోంది. పోరాటాల పురిటిగడ్డ వరంగల్ వేదికగా కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ చేసి తమ సత్తా చాటుతామంటోంది కారు పార్టీ.

BRSలో కొత్త లొల్లి.. హరీష్‌కు దక్కుతుందా? కేటీఆర్‌కు ఇస్తారా? మూడో నాయకుడు ముందుకొస్తారా?

సాధారణంగా అధికార పార్టీలో పదవుల కోసం పోటీ ఉంటుంది. ఒక్కోసారి కుమ్ములాటలు కూడా జరుగుతుంటాయి. కానీ, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో కీలకమైన పదవి కోసం పోటీ ఏర్పడటం.. సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మూడింట్లో రెండు ఆల్రెడీ ఫిక్సయిపోగా... మిగిలిన ఒక్క పోస్టు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఏర్పడింది? ఇంతకీ ఏంటా పదవి? ఎందుకా సస్పెన్స్‌?

ధరణిలో లేనిదేంటి..? భూభారతిలో ఉన్నదేంటి? అన్ని వివాదాలకు ఇస్తుందా చెల్లుచీటీ?

కేసీఆర్ మానస పుత్రికల్లో ఒకటైన ధరణి పోర్టల్, తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ధరణి పోర్టల్.. ధరణి పోర్టల్‌ని సూపర్ పాపులర్ స్కీమ్‌గా మారిపోయింది. కానీ.. నిర్వహణా లోపాలు, అవకతవకలు, కొందరి చేతివాటం.. అన్నీ కలిపి ధరణి చట్టాన్ని అత్యంత వివాదాస్పదంగా మార్చేశాయి. దాన్నే ఆసరాగా చేసుకుని, ధరణికి ప్రత్యామ్నాయం పేరుతో జనంలోకెళ్లి రాజకీయం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కొట్టింది. అధికారంలోకి వచ్చీరాగానే కోదండరెడ్డి నేతృత్వంలో కమిటి వేసి.. ధరణిలో లొసుగుల్ని పసిగట్టి.. కొత్త చట్టం భూభారతి రూపకల్పనకు నడుంకట్టింది రేవంత్ సర్కార్.

BRS: రజతోత్సవ మహాసభపై ఉత్కంఠ! ఉద్యమఖిల్లాల ఉమ్మడి వేదిక గులాబీ జెండాకు ఊపునిస్తుందా?

సవ్వాలే లేదు.. సభలు నిర్వహించడంలో ఇప్పటివరకు ఆ పార్టీని కొట్టినవారే లేరు. ఆవిర్భావం నుంచి ఉద్యమం దాకా.. ఉద్యమం నుంచి అధికారం దాకా.. భారీ బహిరంగసభలను సక్సెస్‌ చేయడంలో కారుపార్టీ ట్రాక్‌ రికార్డు వేరే లెవల్‌. అలాంటి పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక ఆవిర్భావ సంబరాలకు సిద్ధమవుతోంది. మరి, మరోసారి అక్కడే వేదికను సిద్ధం చేయడం వెనక కారణాలేంటి? ఎందుకు అదే ప్లేసును బీఆర్‌ఎస్‌ బాస్‌ ప్రిఫర్‌ చేస్తున్నారు?

KCR: బీఆర్ఎస్‌ సిల్వర్‌జూబ్లీ సభపై కేసీఆర్‌ ఫోకస్‌

వరంగల్‌లో జరిగే గులాబీ పార్టీ సిల్వర్‌జూబ్లీ సభపై కేసీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారా?.. కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారా?.. వరంగల్‌ సభపై ఆ జిల్లా నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారా?.. అసలు.. వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్‌ రజతోత్సవ సభపై కేసీఆర్‌ ఆలోచన ఏంటి?...

KCR: పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు.. ప్రతి ఒక్కడూ కేసీఆరే..! బీఆర్ఎస్‌లో నయా జోష్‌

తెలంగాణ ఉద్యమాన్ని నడపడంలోనైనా.. రాష్ట్రం ఏర్పాడ్డాక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని నడపడంలోపైనా బీఆర్ఎస్‌ది వినూత్న శైలి. పదేళ్ల తర్వాత అధికారానికి దూరమై పార్టీ పరిస్థితి అగమ్యగోరంగా ఉన్న తరుణంలో అటు పార్టీ ప్రెసిడెంట్.. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ సేమ్‌ డైలాగ్స్‌తో మళ్లీ గులాబీ కేడర్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేలా పనిచేసేందుకు ప్రేరేపిస్తున్నారు.

బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయి.. తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారుః కేసీఆర్

రాబోయే రోజుల్లో మళ్లీ సొంతంగానే అధికారంలోకి వస్తామని తెలంగాన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని.. తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆయన హాట్ కామెంట్ చేశారు. అటు ఏపీ రాజకీయాలపై కూడా కేసీఆర్ కామెంట్ చేశారు.

Telangana Assembly: తగ్గేదేలే.. వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఎస్సీ వర్గీకరణపై కీలక చర్చ.. లైవ్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదోరోజు మంగళవారం కొనసాగుతున్నాయి.. ఇవాళ సభ ముందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లు రానుంది.. SC వర్గీకరణ బిల్లుపై మంత్రి దామోదర రాజనర్సింహ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు..

Telangana Assembly: వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులకు ఆమోదం..

ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతోపాటు బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు.. ఈ బిల్లులపై సోమవారం అసెంబ్లీలో సుధీర్ఘ చర్చ జరగనుంది.

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ మళ్లీ రచ్చో రచ్చస్య..!

తెలంగాణ అసెంబ్లీలో గురువారం రాజుకున్న నిప్పురవ్వలు.. ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌తో మొదలైన డ్రామా.. దాని తాలూకు వేడి కంటిన్యూ కాబోతున్నట్లు కనిపిస్తోంది. కానీ.. అంతకుమించిన హీటు పక్కా అంటూ ఎక్స్‌ట్రా ఫ్లేవర్లతో తొడలు కొడుతోంది విపక్ష గులాబీ పార్టీ.