AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card: “ఈ-పాన్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోండి” అంటూ మెయిల్స్.. క్లిక్ చేస్తే డేంజర్

పాన్ కార్డు అనేది అందరికీ అవసరమైన డాక్యుమెంట్. దేశంలో ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించాలంటే ఇది తప్పనిసరిగా అవసరం. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా పాన్ కార్డు అవసరమే. అయితే పాన్ కార్డు పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు.

PAN Card: ఈ-పాన్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోండి అంటూ మెయిల్స్.. క్లిక్ చేస్తే డేంజర్
Pan Card
Venkatrao Lella
|

Updated on: Mar 09, 2026 | 10:10 PM

Share

ఈ-పాన్ కార్డు డౌన్ లోడ్ అంటూ వచ్చే మెయిల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రెస్ ఇన్పర్మేషన్ బ్యూరో(PIB) హెచ్చరించింది. ఈ మేరకు పీఐబీ తన ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టింది. కొంతమంది సైబర్ నేరగాళ్లు ఈ-పాన్ కార్డు డౌన్ లోడ్ చేసుకోండి అంటూ నకిలీ మెయిల్స్ పంపిస్తున్నారు. కొంతమందికి తెలియక ఈ లింకులను క్లిక్ చేస్తున్నారు. ఇలాంటి మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, క్లిక్ చేయవద్దని పీఐబీ స్పష్టం చేసింది. ఈ మెయిల్స్ అన్నీ ఫిషింగ్ ప్రక్రియలో ఓ భాగమని, ఇలాంటి మెయిల్స్‌ను అసలు పట్టించుకోవద్దని స్పష్టం చేసింది.

ఈ లింకులతో జాగ్రత్త

“మీకు e-PAN కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలని అడుగుతూ ఒక ఇమెయిల్ కూడా వచ్చిందా? ఆ ఇమెయిల్ నకిలీదని అర్ధం చేసుకోండి. ఆర్థిక, సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని అడిగే ఏవైనా ఇమెయిల్‌లు, లింక్‌లు, కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌లకు ప్రతిస్పందించవద్దు. ఫిషింగ్ ఇ-మెయిల్‌లను రిపోర్ట్ గురించి వివరాలు కోసం https://incometaxindia.gov.in/pages/report-phishing.aspx ” అంటూ పోస్ట్ చేసింది. సైబర్ క్రిమినల్స్ హానికరమైన లింక్‌లను క్లిక్ చేసేందుకు లేదా ఇన్‌ఫెక్టెడ్ ఫైల్స్‌ను డౌన్ లోడ్ చేసుకునేందుకు ఈ మెయిల్స్ ఉపయోగిస్తారని హెచ్చరించింది. ఈమెయిల్ క్లిక్ చేస్తే వ్యక్తిగత, ఆర్ధిక డేటాను చోరీ చేస్తారని, మీ ఫోన్‌లోని సున్నితమైన సమాచారాన్ని మాల్వేర్ పరికరాల సాయంతో సేకరిస్తారని తెలిపారు. కాగా పాన్ కార్డు అనేది ప్రతీఒక్కరూ వినియోగిస్తూ ఉంటారు. దీంతో పాన్ కార్డు అని కనిపిస్తే ఎవరైనా క్లిక్ చేస్తారు. దీనిని ఆసరాగా ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. నకిలీ లింకులతో బురిడీ కొట్టించి డబ్బులను కొల్లగొడుతున్నారు.  ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులను చోరీ చేస్తున్నారు. మార్చి 8వ తేదీన పీఐబీ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ పోస్టు పెట్టింది. ఇలాంటి నకిలీ లింకులను నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించింది.

Follow Us
పాన్ కార్డ్ డౌన్‌లోడ్ పేరుతో మెయిల్ వచ్చిందా..?
పాన్ కార్డ్ డౌన్‌లోడ్ పేరుతో మెయిల్ వచ్చిందా..?
ఆకాశంలో అద్భుతాలు.. 2026లో అరుదైన సూర్య, చంద్ర గ్రహణాలు
ఆకాశంలో అద్భుతాలు.. 2026లో అరుదైన సూర్య, చంద్ర గ్రహణాలు
ఆత్మీయ పలకరింపు..గుండెకు శ్రీరామరక్ష! ఆక్సిటోసిన్ మ్యాజిక్ తెలుసు
ఆత్మీయ పలకరింపు..గుండెకు శ్రీరామరక్ష! ఆక్సిటోసిన్ మ్యాజిక్ తెలుసు
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. వీటిని ఉడకబెట్టి తింటే..
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. వీటిని ఉడకబెట్టి తింటే..
మమ్ముట్టికి సీఎం విజయన్ క్షమాపణలు.. అసలు ఏం జరిగిందంటే..?
మమ్ముట్టికి సీఎం విజయన్ క్షమాపణలు.. అసలు ఏం జరిగిందంటే..?
పతనం అంచున అమెరికా! 9 రోజుల యుద్ధానికే కుదేలైన ఆర్ధిక వ్యవస్థ
పతనం అంచున అమెరికా! 9 రోజుల యుద్ధానికే కుదేలైన ఆర్ధిక వ్యవస్థ
రైతులకు శుభవార్త అందించిన చంద్రబాబు
రైతులకు శుభవార్త అందించిన చంద్రబాబు
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన స్టోరీతో రవితేజ సినిమా... కట్ చేస్తే..
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన స్టోరీతో రవితేజ సినిమా... కట్ చేస్తే..
తల పైకెత్తి 5 నిమిషాలు ఆకాశం వైపు చూడండి,టెన్షన్ మొత్తం హుష్‌కాకి
తల పైకెత్తి 5 నిమిషాలు ఆకాశం వైపు చూడండి,టెన్షన్ మొత్తం హుష్‌కాకి
ఆండ్రాయిడ్ లేదా ఆపిల్.. రెండింటిలో ఏది సేప్టీ.. దేనివల్ల రిస్క్‌
ఆండ్రాయిడ్ లేదా ఆపిల్.. రెండింటిలో ఏది సేప్టీ.. దేనివల్ల రిస్క్‌