07 March, 2026
Subhash
పశ్చిమాసియ యుద్ధం ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలపైనా పడింది. అందరూ ఊహించిన విధంగానే వంట గ్యాస్ ధరలను చమురు సంస్థలు భారీగా పెంచాయి.
గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ పై రూ.60, కమర్షియల్ సిలిండర్ పై రూ. 115 పెరిగింది. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి.
అయితే, ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పాత ధరలు మాత్రమే కొనసాగుతాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.965కి చేరింది. ఇది వరకు రూ.905 ఉండేది. కమర్షియల్ సిలిందర్ ధర రూ. 2,076కి పెరిగింది.
ఢిల్లీలో డొమెస్టిక్ 14.2 కేజీల సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913కు పెరిగింది. అలాగే కమర్షియల్ 19కేజీల సిలిండర్ ధర రూ.1,768.50 నుంచి రూ.1,883కి పెరిగింది.
కోల్‌కతాలో డొమెస్టిక్ సలిండర్ ధర రూ.912.50కి చేరగా.. కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,835కు పెరిగింది.
చెన్నైలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.928.50కి పెరగ్గా.. కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,043.50కి పెరిగింది.
ముంబైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.912.50కి చేరగా.. కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,835కు పెరిగింది.