మళ్లీ సీన్‌ రివర్స్‌.. ఒక్కసారిగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

01 March, 2026

Subhash

బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్న వేళ మళ్లీ సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

బంగారం, వెండి ధరలు

మార్చి 1న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 4,370 రూపాయలు ఎగబాకింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 4,020 రూపాయలు పెరిగింది.

మార్చి 1న 24 

ఇక వెండి విషయకానికొస్తే.. ఇది కూడా భారీ రికార్డ్‌ స్థాయిలో పెరిగింది. 3 లక్షలు ఉన్న వెండి ధర ఈ రోజు 3.25,000 రూపాయలకు చేరుకుంది.

వెండి ధర

బంగారం ధర పెరిగిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,73,080 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,58,650 రూపాయల వద్ద కొనసాగుతోంది.

తులం బంగారం ధర

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,73,080 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,58,650 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌లో

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ మార్కెట్లను వణికిస్తోంది. దీంతో పసిడి పరుగులు పెడుతోంది.

యుద్ధ వాతావరణం 

ఇరు దేశాలలో జరుగుతున్న యుద్ధాల కారణంగా బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్‌ మార్కరెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇరు దేశాలలో

ఈ యుద్ధాల కారణంగా దేశంలో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డు సృష్టించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

యుద్ధాల కారణంగా