పాత బంగారాన్ని అమ్మేయాలా? కొత్త నగలుగా మార్చుకోవాలా?

02  march 2026

Jyothi Gadda

భారతీయ సంస్కృతితో బంగారాన్ని విడదీసి చూడలేం. ఎందుకంటే.. మన దేశంలో బంగారానికి ఉన్నంత క్రేజ్‌ మరే ఇతర లోహానికి ఉండదు. పెళ్లి, పండగ ఏదైనా సరే అన్ని సందర్బాల్లోనూ బంగారాన్ని వినియోగిస్తారు.

బంగారు నగలను కేవలం అలంకరణ కోసమే కాకుండా, కష్టకాలంలో ఆదుకునే ఆర్థిక భరోసాగా తరతరాలుగా మనవాళ్లు దాచుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం బంగారం ధరలు చుక్కలనుంటుతున్నాయి.

పాత బంగారం అమ్మమ్మలు, నాన్నమ్మలు నాటిది కావచ్చు. దాన్ని కొనేముందు ఎవరైనా నాణ్యతను చెక్ చేస్తారు. ఇప్పుడు బంగారు నాణ్యతను హాల్‌మార్క్ నిర్ణయిస్తుంది. కానీ, పాత నగలపై హాల్ మార్క్ ఉండదు.

దీని వల్ల చాలా మంది వ్యాపారులు ఆ పాత నగలకు ధర కొంచెం తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల కొంత నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి, పాత హాల్‌మార్క్‌ లేని బంగారం మార్చకపోవడమే మంచిది.

ఉదాహరణకు10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,800 అనుకుంటే, దానిని అమ్మితే కేవలం రూ.1.35 లక్షలు మాత్రమే నగదు రూపంలో వస్తుంది. అంటే మీరు చాలానే నష్టపోతున్నట్లు లెక్క.

పాత బంగారం అమ్మడం కంటే, దానిని ఇచ్చి కొత్త నగలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీరు 10 గ్రాముల పాత బంగారాన్ని మార్పిడి చేసుకుంటే, సుమారు రూ.1.45 లక్షల విలువైనవి కొనొచ్చు. 

హాల్‌మార్క్‌డ్ బంగారు ఆభరణాలలో హెచ్‌యూఐడీ అనేది కచ్చితంగా గుర్తుంచుకోవాలి. HUID అంటే హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్. ప్రతి హాల్‌మార్క్‌డ్ వస్తువుకు కేటాయించిన ప్రత్యేకమైన ఆరు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ సంఖ్య.

HUID ద్వారా ఆభరణం స్వచ్ఛతను గుర్తించవచ్చు. వినియోగదారులు BIS కేర్ యాప్‌లోని 'వెరిఫై HUID' ఫీచర్‌ను ఉపయోగించి కూడా సదరు హెచ్‌యూఐడీ నంబర్‌ను ధ్రువీకరించవచ్చు.