కొబ్బరి పాలతో కోటి లాభాలు..!

04 October 2025

Jyothi Gadda

కొబ్బ‌రిపాలలో అనేక పోష‌కాలు ఉంటాయి. కొబ్బ‌రిపాల‌ను త‌ర‌చూ తాగ‌డం వ‌ల్ల ప‌లు వ్యాధులను న‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కొబ్బ‌రిపాల‌ను ఒక క‌ప్పు మోతాదులో తీసుకుంటే సుమారుగా 400 క్యాల‌రీల మేర శ‌క్తి ల‌భిస్తుంది. కొబ్బ‌రిపాల‌తో శ‌రీరానికి త‌క్ష‌ణ‌ శ‌క్తి ల‌భిస్తుంది. చురుగ్గా ప‌నిచేస్తారు. 

కొవ్వు 40 గ్రాములు, పిండి ప‌దార్థాలు 13 గ్రాములు, ప్రోటీన్లు 5 గ్రాములు, ఫైబ‌ర్ 5 గ్రాములు, స్వ‌ల్ప మొత్తాల్లో విట‌మిన్ సి, ఫోలేట్‌, విట‌మిన్లు డి, ఎ, బి12 ఉంటాయి. 

వ్యాయామం చేసిన వారు లేదా శారీర‌క శ్ర‌మ చేసిన వారు బాగా అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంటే కొబ్బ‌రి పాల‌ను తాగాలి. దీంతో శ‌క్తి ల‌భించి మ‌ళ్లీ ఉత్సాహంగా మారుతారు. 

కొబ్బ‌రిపాల‌లో ఉండే మీడియం చెయిన్ ట్రై గ్లిజ‌రైడ్స్ మ‌న శ‌రీర మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతో క్యాల‌రీలు ఖ‌ర్చ‌యి కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

అధ్య‌య‌నాల ప్ర‌కారం కొబ్బ‌రిపాల‌లో ఉండే మీడియం చెయిన్ ట్రై గ్లిజ‌రైడ్స్ ఆక‌లిని నియంత్రిస్తాయి. కొవ్వు క‌ర‌గ‌డాన్ని ప్రోత్స‌హిస్తాయి. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగేలా చేస్తాయి. 

బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. కొబ్బ‌రిపాల‌ను తాగడం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. శ‌రీరం ఇన్‌ఫెక్ష‌న్ల‌ను, రోగాను త‌గిస్తుంది. 

ఈ పాల‌లో ఉండే లారిక్ యాసిడ్ యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. కొబ్బ‌రిపాల‌ను సేవిస్తుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.