ఆరోగ్యానికి రాగులు.. ఈరోజుల్లో తప్పనిసరి! 

26  January 2026

Jyothi Gadda

తృణ ధ్యాన్యాల్లో ఒకటైన రాగులను పేదవాడి ఆహారంగా చెబుతారు. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటూ బోలెడు పోషకాలు ఉంటాయి. 

రాగులలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, భాస్వరం, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటూ మలబద్దకాన్ని నివారిస్తుంది.

ఐరన్​, క్యాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగిన వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చట.

ఫైబర్​ సమృద్ధిగా ఉండి, అసంతృప్త కొవ్వులు తక్కువ. బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి రాగులు చక్కటి ఆహారం.

రాగులను మీ రోజూవారీ ఆహారంలో చేర్చుకుని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. రాగుల్లో అధికంగా లభించే ఫైబర్​ మీ జీర్ణవ్యవస్థ మంచిది.

అలాగే మిమ్మల్ని అతిగా తినకుండా ఆపుతుంది. చాలాసేపటి వరకు మీ కడపును నిండుగా ఉంచుతుంది. ఫిట్​నెస్​ ప్రియులు, ఉబకాయం సమస్యకు పరిష్కారం.

రాగి పిండిలో పుష్కలంగా లభించే మెగ్నీషియం, పొటాషియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. రాగులు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

రాగులను తరచుగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే రాగుల్లో ఫైబర్​ అధికంగా ఉంటుంది.