24 క్యారెట్ల బంగారంలో పెట్టుబడి పెట్టడం లాభమా నష్టమా ?
04 October 2025
Jyothi Gadda
బంగారం ధర భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో గోల్డ్‌పై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం గోల్డ్‌రేట్ ఆల్ టైం రికార్డులను బద్దలు కొట్టడం అని చెప్పవచ్చు.
24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేయడం అనేది కేవలం పెట్టుబడి రూపంలోనే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ క్వాలిటీతో బంగారు ఆభరణాలను తయారు చేయడం దాదాపు అసాధ్యం.
కేవలం 916 కేడియం 22 క్యారెట్ల బంగారంతోనే బంగారు ఆభరణాలను తయారు చేయించుకోవాలి. అప్పుడే నగలు దృఢంగా మన్నికగా ఉంటాయి.
మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం కాయిన్స్ రూపంలోనూ, కడ్డీల రూపంలోనూ, బిస్కెట్ రూపంలోనూ లభిస్తుంది. ఒక కేజీ చొప్పున కొన్నట్లయితే బంగారం బార్ రూపంలో లభిస్తుంది.
24 క్యారెట్ల మేలిమి బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవచ్చు. వీటిని ఇంట్లో భద్రపరచుకున్నట్లైతే సేఫ్టీ పరంగా ప్రమాదకరం అని చెప్పాలి.
24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేసినప్పుడు వాటిని తిరిగి నగదుగా మార్చుకోవాలి అనుకున్నట్లయితే, మళ్లీ వాటిని నగల షాపులకు గాని, గోల్డ్ రిఫైనరీలకు గాని విక్రయించాల్సి ఉంటుంది.
కానీ ఇది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం. దీనికన్నా కూడా డిజిటల్ గోల్డ్ రూపంలో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే సేఫ్టీ గురించి చింతించాల్సిన అవసరం లేదు.
డిజిటల్ గోల్డ్ సర్వీసులను ప్రస్తుతం అన్ని రకాల ఫైనాన్షియల్ టెక్నాలజీ యాప్స్ అందిస్తున్నాయి. వీటిలో బంగారాన్ని కేవలం 100 రూపాయల నుంచి కొనుగోలు చేయవచ్చు.