ఆరోగ్యానికి అవిసె గింజల లడ్డు.. ఆ వ్యాధులకు వణుకే..!
03 October 2025
Jyothi Gadda
అవిసె గింజలు పోషకాల గని. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, లిగ్నాన్స్ వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి.
అవిసె గింజలలో లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.
అవిసె గింజలు తినడం వల్ల ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుంది. మలబద్ధకం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చు.
అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఇతర పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అవిసె గింజలు చాలా మేలు చేస్తాయి. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి,మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
రోజూ క్రమం తప్పకుండా అవిసె గింజలు తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తినాలనే కోరిక తగ్గుతుంది.
అవిసె గింజలు తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతున్నా వారు క్రమం తప్పకుండా అవిసె గింజలు తీసుకుంటే మంచిది.
ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్, పెద్దపేగు, స్కిన్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో అవిసె గింజల్లోని లిగ్నాన్స్ సహాయపడతాయని సూచిస్తున్నారు.