AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Growth: దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. వీటిని ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు సైతం మళ్ళీ రావాల్సిందే!

ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టును కావాలని ప్రతి ఒక్కరూ కొరుకుంటారు. కానీ ఈ మధ్య మారుతున్న లైఫ్‌స్టైల్ ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది జుట్టును రాలుడు సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించుకొనేందుకు నిపుణులు కొన్ని ముఖ్యమైన అంశాలను వివరించారు. వాటిని ఫాలో అవ్వడం ద్వారా ఈజీగా రాలిన జుట్టు తిరిగి పొందచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Hair Growth: దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. వీటిని ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు సైతం మళ్ళీ రావాల్సిందే!
Natural Hair Growth
Anand T
|

Updated on: Mar 09, 2026 | 9:55 PM

Share

జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో వంశపారంపర్యత ఒకటి. మన తల్లిదండ్రులు, తాత ముత్తాతల నుండి వచ్చే జన్యువులు జుట్టు రంగు, ఆకృతి, సాంద్రతను ప్రభావితం చేస్తాయి. అయితే, పూర్తిగా బట్టతల వచ్చిన వారికి ఆహారం ద్వారా జుట్టును తిరిగి పెంచడం సాధ్యం కాదని, అలాంటి సందర్భాలలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మాత్రమే మార్గం నిపుణులు చెబుతున్నారు. కానీ, జుట్టు రాలడాన్ని నివారించి, తిరిగి జుట్టును పెంచడానికి అనేక సహజ పద్ధతులు ఉన్నాయని అంటున్నారు.

జుట్టు రాలడానికి గల ముఖ్య కారణాలు

చుండ్రు: తలలో చుండ్రు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరిచి, జుట్టు అధికంగా రాలడానికి దారితీస్తుంది. అనేక మంది వారానికి ఒకసారి తలస్నానం చేస్తారని, అయితే శరీరానికి రోజూ స్నానం చేసినట్టే తలకు కూడా రోజూ స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. చెమట, వ్యర్థ పదార్థాలు తలలో పేరుకుపోకుండా రోజూ తలస్నానం చేయాలని.. తలస్నానం చేసేటప్పుడు వేళ్ళతో మాడును నెమ్మదిగా రుద్దడం ద్వారా చుండ్రు పూర్తిగా తొలగిపోతుందని, జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయని, దురద వంటి సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.

ప్రోటీన్ లోపం: జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు అత్యవసరం. బరువు తగ్గడానికి డైటింగులు చేసేవారు, లేదా సరిపడా ప్రోటీన్ ఆహారం తీసుకోని వారిలో మాంసకృత్తుల లోపం ఏర్పడుతుంది. ఈ లోపం కారణంగా జుట్టు బలహీనపడి, విరిగిపోవడం లేదా ఊడిపోవడం జరుగుతుంది. మొలకెత్తిన విత్తనాలను తినడం ద్వారా మీ శరీరంలో ప్రోటీన్ శాతాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు..

రాలిన జుట్టు తిరిగి రావాలంటే?

మొలకెత్తిన విత్తనాలు ప్రోటీన్‌కు అత్యంత శ్రేష్ఠమైన వనరు నిపుణులు నొక్కి చెప్పారు. గింజలు మొలకెత్తినప్పుడు వాటిలోని ప్రోటీన్ రెట్టింపు అవుతుందని, మొలకలు శరీరం ఉత్పత్తి చేసే హార్మోన్ల పనితీరును కూడా మెరుగుపరుస్తాయని వివరించారు. జుట్టు ఊడిన చోట తిరిగి పెరగడానికి, జుట్టు చిక్కగా, ఒత్తుగా మారడానికి మొలకలు అద్భుతంగా పనిచేస్తాయని తెలిపారు.

మొలకలను సులువుగా తినడానికి కొన్ని చిట్కాలను కూడా నిపుణులు వివరించారు. ఖర్జూరం ముక్కలు, దానిమ్మ గింజలు, ఎండు కిస్‌మిస్‌లు, ఆపిల్, కర్బూజ, ద్రాక్ష వంటి పండ్ల ముక్కలను మొలకలలో కలిపి తినడం వల్ల వాటి పచ్చి వాసన తగ్గి, రుచిగా ఉంటాయని, తద్వారా వాటిని నిరభ్యంతరంగా రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొలకలు కేవలం జుట్టు ఆరోగ్యానికే కాకుండా, థైరాయిడ్ హార్మోన్లు, ఇతర శరీర హార్మోన్లు, శక్తి స్థాయిలు, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా తోడ్పడతాయని తెలిపారు. కాబట్టి, ఆరోగ్యకరమైన జుట్టుతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం మొలకెత్తిన విత్తనాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. వీటిని ఉడకబెట్టి తింటే..
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. వీటిని ఉడకబెట్టి తింటే..
మమ్ముట్టికి సీఎం విజయన్ క్షమాపణలు.. అసలు ఏం జరిగిందంటే..?
మమ్ముట్టికి సీఎం విజయన్ క్షమాపణలు.. అసలు ఏం జరిగిందంటే..?
పతనం అంచున అమెరికా! 9 రోజుల యుద్ధానికే కుదేలైన ఆర్ధిక వ్యవస్థ
పతనం అంచున అమెరికా! 9 రోజుల యుద్ధానికే కుదేలైన ఆర్ధిక వ్యవస్థ
రైతులకు శుభవార్త అందించిన చంద్రబాబు
రైతులకు శుభవార్త అందించిన చంద్రబాబు
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన స్టోరీతో రవితేజ సినిమా... కట్ చేస్తే..
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన స్టోరీతో రవితేజ సినిమా... కట్ చేస్తే..
తల పైకెత్తి 5 నిమిషాలు ఆకాశం వైపు చూడండి,టెన్షన్ మొత్తం హుష్‌కాకి
తల పైకెత్తి 5 నిమిషాలు ఆకాశం వైపు చూడండి,టెన్షన్ మొత్తం హుష్‌కాకి
ఆండ్రాయిడ్ లేదా ఆపిల్.. రెండింటిలో ఏది సేప్టీ.. దేనివల్ల రిస్క్‌
ఆండ్రాయిడ్ లేదా ఆపిల్.. రెండింటిలో ఏది సేప్టీ.. దేనివల్ల రిస్క్‌
చూస్తే పిచ్చి మొక్క అనుకునేరు.. మీకు 100 ఏళ్లు ఆయుష్షునిచ్చే..
చూస్తే పిచ్చి మొక్క అనుకునేరు.. మీకు 100 ఏళ్లు ఆయుష్షునిచ్చే..
100 దాటినా యువకుడిలాగే ఉండాలా? సీక్రెట్ పిల్స్ వచ్చేస్తున్నాయ్
100 దాటినా యువకుడిలాగే ఉండాలా? సీక్రెట్ పిల్స్ వచ్చేస్తున్నాయ్
రోజుల తరబడి బాటిల్ కడగకుండా నీళ్లు తాగుతున్నారా?.. ఇదే జరిగేది
రోజుల తరబడి బాటిల్ కడగకుండా నీళ్లు తాగుతున్నారా?.. ఇదే జరిగేది