AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ

వైశాఖ శుక్ల పక్షంలో తదియ రోజున అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకోవటం సంప్రదాయం. వైశాఖే మాసి రాజేంద్ర శుక్ల పక్షే తృతీయకా|| అక్షయాసాతిథిః ప్రోక్తా కృత్తికా రోహిణీయుతా|| అక్షయ అంటే క్షయం కానిది.. పుణ్యాన్ని కలిగించే ఒక తిథి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ రోజున చేసే దానాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయని నమ్మకం. ఈ రోజున చేసే గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏవైనా శుభ ఫలితాలను అందిస్తాయి. ఈ రోజున చేసే జప, హోమ, దానాదులు అక్షయమవుతాయి కనుకనే ఇది అక్షయతృతీయ అయింది. ఈ రోజున గంగాస్నానం చేసేవారు సకల పాపవిముక్తులు అవుతారు. లక్ష్మీ సహితమైన నారాయణుని, గౌరీ సహితుడైన త్రిలోచనుని పూజించాలి. పూజ అనంతరం వేసవికి అవసరం అయిన వస్తువులను విరివిగా దానం చేస్తారు. ఈ తిథి రోజున బంగారం కొనడం శుభప్రదమని ఒక విశ్వాసం ఉత్తర దేశంలో పుట్టి క్రమంగా దక్షిణ దేశానికి వ్యాపించింది. ఈ రోజు ఏది దానం చేసిన మనకు పదిరెట్లు మళ్ళీ లభిస్తుందని అర్థం. కానీ తప్పకుండా బంగారం కొనాలని ఏ గ్రంథాల్లోనూ లేదు.

అక్షయ తృతియ రోజున ఎటువంటి మంచి చెడులు చూసుకోకుండా శుభకార్యాలు చేయవచ్చని నమ్మకం. అంతేకాదు ఈ రోజున కొన్ని పనులు చేయవద్దు. . జూదం, మద్యపానం, అసత్యం, గర్వం, కామం, హింస, వైరం, దొంగతనం వంటి పనులు చేయవద్దు అని పురాణాల్లో పేర్కొన్నారు. అక్షయ తృతీయ రోజున చేసే పాప కర్మల ఫలితం అక్షయంగా వెంటాడుతూనే ఉంటుందని ధర్మ శాస్త్రంలో పేర్కొంది. ఈ ఏడాది అక్షయ తృతీయ ను ఏప్రిల్ 19వ తేదీన జరుపుకోనున్నారు.

ఇంకా చదవండి

Silver Price: వెండి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన సిల్వర్‌

Silver Price Today: ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువలో మార్పులు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం పసిడి ధరలపై పడుతోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. అయితే ఇటీవల నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే తాజాగా మాత్రం వెండి ధర భారీగానే తగ్గింది..

Silver Price Crash: వెండి ధరల్లో పెను పతనం? కిలో వెండి లక్షకు చేరుతుందా? మార్కెట్‌లో ప్రకంపనలు.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Silver Price Crash: యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. పెట్టుబడిదారులు భయంతో తమ వద్ద ఉన్న నిల్వలను విక్రయించడాన్ని ఆర్థిక పరిభాషలో 'పానిక్ సెల్లింగ్' అంటారు. ప్రస్తుతం వెండి మార్కెట్‌లో ఇదే జరుగుతోంది. యుద్ధం గనుక ముదిరితే..

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్‌, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతుండగా, అదే ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.2,74,900 వద్ద ట్రేడవుతోంది. గతంలో కిలో వెండి ధర ఏకంగా 4 లక్షల రూపాయల వరకు వెళ్లిగా ప్రస్తుతం చూస్తే భారీగా తగ్గిపోయింది. దాదాపు లక్ష రూపాయలకుపైగానే పడిపోయింది.

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే..!

Gold, Silver Prices: అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువపై ఆధారపడి ధరలు రోజులో ఎప్పుడైనా మారవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపులో ఒకసారి సరిచూసుకోవడం మంచిది. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఈరోజు బంగారం కొనాలనుకుంటే హాల్‌మార్క్ (BIS Hallmark) ఉన్న నగలను

Gold Price Today: మహిళలను నిరుత్సాహపర్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?

Gold, Silver Price Today: బంగారం ధరలు ఏప్రిల్‌ 20వ తేదీన సోమవారం అతి స్వల్పంగా తగ్గింది. అంటే తులం బంగారం పై కేవలం 10 రూపాయలు మాత్రమే దిగి రావడం మహిళలను నిరుత్సాహపర్చింది. అక్షయతృతీయ రోజు భారీగా తగ్గుతుందని భావించినప్పటికీ అతి..

Gold, Silver Prices: ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. మరింత దిగజారిన వెండి!

Gold, Silver Prices: బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్నాయి. గతంలో ఉన్న ధరలను పోలిస్తే ఇప్పుడు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి..

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు.. ఆ 92 నిమిషాలే కీలకం!

Akshaya Tritiya 2026: ఈసారి అక్షయ తృతీయ నాడు స్వాతి, విశాఖ నక్షత్రాలతో పాటు బ్రహ్మ, ఇంద్ర, గజకేసరి, మాలవ్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు ఏప్రిల్ 20న రవి యోగం కూడా తోడవుతోంది. ఈ కాలంలో బంగారం, వెండి లేదా రియల్ ఎస్టేట్ రంగంలో..

Akshaya Tritiya: షాకింగ్ న్యూస్.. బంగారం కొనాలా? వెండి ధర రూ.3.5 లక్షలు..?

Akshaya Tritiya Gold, Silver: బంగారం, వెండి ధరలపై షాకింగ్ న్యూస్ వెలువడింది. మార్కెట్ గణాంకాలను గమనిస్తే, బంగారం, వెండి పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించాయి. 2020లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.46,000 ఉండగా, 2026 నాటికి అది..

Gold Price Today: అక్షయ తృతీయ.. బంగారం, వెండి ధరలు తగ్గాయా? పెరిగాయా? హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

Gold Price Today: పండుగ సీజన్ కావడంతో నగల దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండవచ్చు. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఈరోజు బంగారం కొనాలనుకుంటే హాల్‌మార్క్ (BIS Hallmark) ఉన్న నగలను మాత్రమే ఎంచుకోండి. ఇది మీరు కొనే బంగారం నాణ్యతకు గ్యారెంటీ ఇస్తుంది..

అక్షయ తృతీయ రోజు ఇలాంటి కలలు వస్తే మీకు మంచి రోజులు వచ్చినట్లే!

ఎంతో శుభప్రదమైన అక్షయ తృతీయ పండుగ రాబోతుంది. ఏప్రిల్ 19 ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు కొన్ని రకాల కలలు రావడం చాలా మంచిదంట. కాగా, ఈ రోజు ఎలాంటి కలలు వస్తే అదృష్టమూ ఇప్పుడు చూద్దాం.

అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా చేయండి.. దెబ్బకు కనక వర్షం కురవాల్సిందే..

అక్షయ తృతీయ పర్వదినం వైశాఖ మాసంలో వచ్చే అత్యంత ముఖ్యమైన దినం. "అక్షయం" అంటే ఎప్పటికీ నాశనం కానిది. ఈ రోజు చేసే ఏ పనికైనా అక్షయమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు, పండితులు పేర్కొంటున్నారు. అక్షయ తృతీయ అనగానే చాలామంది బంగారం కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే, బంగారం కొనుగోలు అనేది ఈ రోజు చేయవలసిన క్రియల్లో ఒక శాతానికే చెందిందని, దీనికి మించి 99 శాతం ఇతర ముఖ్యమైన దానధర్మాలు, పూజలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

Gold, Silver Prices Crash: బంగారం, వెండి ప్రియులకు పండగే.. భారీ పతనం.. కేజీ వెండిపై లక్షన్నర తగ్గుదల!

Gold and Silver Prices Crash: బంగారం, వెండి ధరల్లో చోటుచేసుకున్న ఈ భారీ మార్పులు వినియోగదారులకు పండగ ముందే వచ్చినట్లుగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్షయ తృతీయ ఏప్రిల్ 19, 2026) కు ఒక్క రోజు ముందు ఈ స్థాయిలో ధరలు తగ్గడం విశేషం.

ఆ రోబోట్ పాపం ధోనీ దెబ్బకి షాక్ అయినట్టుంది
ఆ రోబోట్ పాపం ధోనీ దెబ్బకి షాక్ అయినట్టుంది
ఏపీలో కొత్త పింఛన్లపై బిగ్ అప్డేట్.. జారీ అప్పటినుంచే..
ఏపీలో కొత్త పింఛన్లపై బిగ్ అప్డేట్.. జారీ అప్పటినుంచే..
ఎండ వేడి, ఉబ్బరానికి కిటికీలు తెరిచి పడుకుంటున్నారా? జాగ్రత్త!
ఎండ వేడి, ఉబ్బరానికి కిటికీలు తెరిచి పడుకుంటున్నారా? జాగ్రత్త!
మహానటి సావిత్రి ఆ తెలుగు స్టార్ హీరోను బావ అని పిలిచేది తెలుసా?
మహానటి సావిత్రి ఆ తెలుగు స్టార్ హీరోను బావ అని పిలిచేది తెలుసా?
ఈ పుట్టిన తేదీల వారికి బంగారం వేసుకుంటే అదృష్టం వెంటపడుతుంది!
ఈ పుట్టిన తేదీల వారికి బంగారం వేసుకుంటే అదృష్టం వెంటపడుతుంది!
మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా
మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా
చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
టాస్ గెలిచిన ముంబై.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే
టాస్ గెలిచిన ముంబై.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే
యూట్యూబ్ సంపాదన చెప్పిన జబర్దస్త్ మహిధర్..
యూట్యూబ్ సంపాదన చెప్పిన జబర్దస్త్ మహిధర్..
అందమైన పూలు..కానీ,అడవులకు శాపం! భారతదేశాన్ని వణికిస్తున్న ఈ మొక్క
అందమైన పూలు..కానీ,అడవులకు శాపం! భారతదేశాన్ని వణికిస్తున్న ఈ మొక్క