Gold Rate Today: బంపర్ బొనాంజా.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..
మీకు గుర్తుందా? 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం మొన్నీమధ్య లక్షా రెండువేల 62 రూపాయలకు చేరింది. ఇది ఆల్‌టైమ్ హై. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు- మొన్నటిదాకా మిడిసిపడిన పసిడి.. ఇప్పుడు దిగివస్తోంది. గత నెల రోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బంగారం ధరలు భారీ ఊరటను ఇచ్చాయి.

మీకు గుర్తుందా? 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం మొన్నీమధ్య లక్షా రెండువేల 62 రూపాయలకు చేరింది. ఇది ఆల్‌టైమ్ హై. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు- మొన్నటిదాకా మిడిసిపడిన పసిడి.. ఇప్పుడు దిగివస్తోంది. గత నెల రోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బంగారం ధరలు భారీ ఊరటను ఇచ్చాయి.. బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతుంది. ఈ క్రమంలోనే.. గురువారం మరింతగా తగ్గి పసిడి ప్రియులకి భారీ ఊరట కలిగించింది. ఒక్క రోజులోనే బంగారం ధర రూ.2,180 తగ్గింది.. 10 రోజుల్లో ఏకంగా రూ.5,620 ధర తగ్గింది.. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,730 గా కొనసాగుతోంది.. ఏప్రిల్ 22న లక్ష మార్కు దాటేసిన బంగారం ఆ తర్వాత ఆ దూకుడు కొనసాగించలేదు. – ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ మధ్యలో ఒకసారి మాత్రమే స్వలంగా పెరిగింది. ఓవరాల్‌గా ఈ 10 రోజుల్లో 10 గ్రాములకి 5 వేల 620 రూపాయలు రేటు తగ్గింది. వెండి ధర రూ.2వేలు తగ్గి 98000లుగా ఉంది.
లేటెస్ట్ బంగారం, వెండి ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.87,750 లుగా ఉండగా.. 24క్యారెట్ల బంగారం ధర.. 95,730లుగా ఉంది..
విజయవాడ, విశాఖపట్నంలో.. 22 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.87,750 లుగా ఉండగా.. 24క్యారెట్ల బంగారం ధర.. 95,730లుగా ఉంది..
ఢిల్లీలో 22 క్యారెట్ల ధర 87,900, 24 క్యారెట్ల ధర రూ.95,880, ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87750, 24 క్యారెట్ల ధర రూ.95,730, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87750, 24 రూ.95730 లుగా ఉంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర 1,07,000 లుగా ఉంది.. ఢిల్లీలో వెండి ధర కిలో రూ.98,000, ముంబైలో రూ.98,000, చెన్నైలో 1,07,000 లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




