సినీ నటి రష్మిక మందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 4న హైదరాబాద్ లో జరగనున్న తన వివాహ రిసెప్షన్ కు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను ఆమె ఆహ్వానించారు. విజయ్ దేవరకొండతో రష్మిక వివాహ రిసెప్షన్ ఆహ్వాన పత్రికను అందజేసి, కొద్దిసేపు ముచ్చటించారు. ఆమె రాకతో ముఖ్యమంత్రి నివాసం సందడిగా మారింది.