విజయ్ దేవరకొండ, రష్మిక మందనల పెళ్లి తర్వాత, వారి రిసెప్షన్ సందడి మొదలైంది. మార్చి 4న హైదరాబాద్లో జరగనున్న రిసెప్షన్ కోసం సెలబ్రిటీలను ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి రష్మిక ఆహ్వానం అందించిన చిత్రాలు వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి సతీమణి ఆమెను ఆశీర్వదించారు. అల్లు అర్జున్ కుటుంబానికి కూడా ఆహ్వానం పలికిన పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.