AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: మీ పీఎఫ్ అకౌంట్‌ ఇనాక్టివ్ అయితే డబ్బులు ఎలా తీసుకోవాలి..? ఈ సింపుల్ పని చేస్తే మీకు రీఫండ్

మీ ఈపీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అయిందా.. డబ్బులను ఎలా విత్ డ్రా చేసుకోవాలో అర్థం కావడం లేదా.. అయితే ఇది మీ కోసమే. మీ అకౌంట్ ఇనాక్టివ్ అయినా మీరు నగదును తీసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని పద్దతులను పాటించాల్సి ఉంటుంది. వాటి వివరాలు చూద్దాం.

EPFO: మీ పీఎఫ్ అకౌంట్‌ ఇనాక్టివ్ అయితే డబ్బులు ఎలా తీసుకోవాలి..? ఈ సింపుల్ పని చేస్తే మీకు రీఫండ్
Epfo 2
Venkatrao Lella
|

Updated on: Mar 02, 2026 | 1:15 PM

Share

మీ పీఎఫ్ అకౌంట్ మూడు సంవత్సరాల పాటు యాక్టివ్‌గా లేకపోతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా దానిని ఇనాక్టివ్‌గా పరిగణిస్తుంది. 3 సంవత్సరపాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోయినా లేదా ఎలాంటి క్లెయిమ్స్ చేయకపోయినా అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. ఉద్యోగం మారిన తర్వాత లేదా ఉద్యోగానికి కొన్నేళ్ల పాటు విరామం తీసుకున్నాక, పదవీ విరమణ చేసిన తర్వాత చాలామంది పీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోవడం మానేస్తారు. దీని వల్ల అకౌంట్ పనిచేయడం ఆగిపోవడం వల్ల అందులోని నగదు కూడా అలాగే ఉంటుంది. ఇలాంటి సమయంలో పీఎఫ్ అకౌంట్లోని డబ్బులు ఆటోమేటిక్‌గా బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటి అవకాశం లేదు. మీ పీఎఫ్ అకౌంట్లో రూ.వెయ్యి కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే మీరే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదెలానో చూద్దాం.

యాక్టివేట్ చేసుకోండి

ముందుగా మీరు మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోండి. అనంతరం కేవైసీ ప్రక్రియ పూర్తి చేయండి. మీ ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ సమాచారం సరిగ్గా ఉందో.. లేదో చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఈపీఎఫ్‌వో పోర్టల్‌కి లాగిన్ అవ్వండి. పోర్టల్‌లోని హెల్ప్ విభాగానికి వెళ్లి అకౌంట్‌ను యాక్టివ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయండి. మీ యజమాని, సంబంధింత అధికారులు ధృవీకరించాక మీ అకౌంట్ యాక్టివ్ అవుతుంది.

క్లెయిమ్ చేసుకోవాలంటే..?

అకౌంట్ యాక్టివేట్ అయ్యాక మీ డబ్బులను విత్ డ్రా చేసునేందుకు క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టుకోండి. ఇందుకోసం ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో సర్వీసెస్ సెక్షన్‌లోకి వెళ్లి క్లెయిమ్‌ను దాఖలు చేయండి. పెన్షన్ విత్ డ్రా కోసం ఫారం 10సీ, పదవీ విరమణ కోసం ఫారం 19, అవసరాల కోసం విత్ డ్రా చేసుకోవాలంటే ఫారం 31 సమర్పించండి. ఇక బ్యాంక్ వివరాలను అందించిన తర్వాత సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మూడు రోజుల్లోగా మీ నగదు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి.

ఆఫ్‌లైన్‌లో ఎలా..?

ఇక ఆఫ్‌లైన్‌లో కూడా నగదు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ ప్రాంతీయ ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఫారం పూర్తి చేసి అవసరమైన పత్రాలు అందించాలి. ఆధార్, పాన్, బ్యాంక్ పాస్ బుక్ కాపీలు ఇవ్వాలి. ఆ తర్వాత అధికారులు పరిశీలించి మీకు ఆఫ్లైన్‌లో నగదును అందిస్తారు. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో క్లెయిమ్ సబ్మిట్ చేశాక.. సాంకేతిక కారణాల వల్ల రిజెక్ట్ అయితే ఆఫ్ లైన్ ఆప్షన్ ఎంచుకోవడం మంచిది. ముందుగా ఆన్ లైన్ ద్వారా క్లెయిమ్‌కు ప్రయత్నించండి.

Follow Us
కోటీశ్వరులు కావాలంటే ఎక్కడ పెట్టుబడిపెట్టాలో తెలుసా..?
కోటీశ్వరులు కావాలంటే ఎక్కడ పెట్టుబడిపెట్టాలో తెలుసా..?
నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..!
నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..!
2028 నుంచి పూర్తిగా మారిపోనున్న ఐపీఎల్ షెడ్యూల్
2028 నుంచి పూర్తిగా మారిపోనున్న ఐపీఎల్ షెడ్యూల్
హాలీడేస్‌లో పిల్లలకు బెస్ట్ స్నాక్స్.. పోషకాలనిచ్చే లడ్డూ ఇదే!
హాలీడేస్‌లో పిల్లలకు బెస్ట్ స్నాక్స్.. పోషకాలనిచ్చే లడ్డూ ఇదే!
వేగంగా మారుతున్న సమీకరణాలు.. విజయ్‌కు లైన్‌క్లియర్!
వేగంగా మారుతున్న సమీకరణాలు.. విజయ్‌కు లైన్‌క్లియర్!
ఈ వస్తువులు ఎవరికీ గిఫ్ట్‌గా ఇవ్వకండి.. పెద్ద సమస్యలు రావచ్చు!
ఈ వస్తువులు ఎవరికీ గిఫ్ట్‌గా ఇవ్వకండి.. పెద్ద సమస్యలు రావచ్చు!
సమ్మర్ స్పెషల్.. తాటి ముంజలతో కర్రీ.. ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!
సమ్మర్ స్పెషల్.. తాటి ముంజలతో కర్రీ.. ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!
నెలకు రూ.2 లక్షల జీతంతో కోల్ ఇండియాలో 276 ఉద్యోగాలు.. పరీక్ష లేదు
నెలకు రూ.2 లక్షల జీతంతో కోల్ ఇండియాలో 276 ఉద్యోగాలు.. పరీక్ష లేదు
కైలాసగిరి టూరిజంలో కొత్త మణిహారం.. భారీ త్రిశూలం ప్రత్యేక ఆకర్షణ
కైలాసగిరి టూరిజంలో కొత్త మణిహారం.. భారీ త్రిశూలం ప్రత్యేక ఆకర్షణ
వేసవిలో తులసి మొక్క గుబురుగా, ఆరోగ్యంగా పెరిగే రహస్యం ఇదే
వేసవిలో తులసి మొక్క గుబురుగా, ఆరోగ్యంగా పెరిగే రహస్యం ఇదే
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌