పవన్ కల్యాణ్
అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్‌ను ఆయన ఫ్యాన్స్ పవన్ స్టార్, జనసేనానిగా పిలుచుకుంటారు. 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో పవన్ జన్మించారు. అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల మక్కువ పెంచుకున్న పవన్.. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశారు. తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ చిత్రాలు పవన్‌కు మంచి గుర్తింపు సాధించిపెట్టాయి. 27 ఏళ్ల సినీ ప్రస్థానంలో పవన్ సినిమాలు కలెక్షన్ల రికార్డులను తిరగరాసాయి. నిర్మాత, దర్శకుడిగానూ ప్రయత్నించారు. జపాన్ దర్శకుడు అకీరా కురసోవా స్ఫూర్తితో దర్శకుడుగా ‘జానీ’ చిత్రాన్ని రూపొందించారు. పవన్‌కు మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రవేశం ఉంది.
2008లో తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ ద్వారా పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజా రాజ్యం పార్టీ యువజన విభాగానికి అధ్యక్షునిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ఆ పార్టీని వీడిన పవన్.. 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించారు. 2019లో 140 నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసింది. పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీచేసి, రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెవిచూశారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన విజయం సాధించింది. 2024లో ఏపీలో జరిగే జమిలి ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
సోషల్ మీడియాలోనూ పవన్ కల్యాణ్‌కు విశేషమైన ఆదరణ ఉంది. ఇటీవల ఇన్‌స్టాగ్రమ్‌లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్‌కు ఒక్క పోస్ట్ చేయకుండానే లక్షల సంఖ్యలో ఫాలోవర్లు చేరారు. జనసేనాన్ని క్రేజ్ అలాంటిది మరి..!