Pawan Kalyan- Suriya: పవన్ రిజెక్ట్ చేసిన కథతో సూర్య సినిమా.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్.. ఏ మూవీనో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే ఓజీ సినిమాతో మన ముందుకు వచ్చారు. స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా మరోసారి తన స్టైల్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశాడు. దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు పవన్.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు చేసినా, చేయకపోయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. పైగా ఇప్పుడు ఆయన పాపులారిటీ మరింత పెరుగుతోంది. పవన్ కల్యాణ్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలున్నాయి. ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే పవన్ కల్యాణ్ కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా చాలానఏ ఉన్నాయి. వివిధ కారణాలతో పవన్ వద్దనుకున్న కథలతో ఇతర హీరోలు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, అతడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిరపకాయ్.. ఇలా పవన్ రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలా పవన్ కల్యాణ్ వద్దనుకున్న సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేశాడు. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?
సూర్య హీరోగా చేసిన గజినీ సినిమా ముందుగా చాలా మంది స్టార్ హీరోల దగ్గరకు వెళ్లింది. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒకరు. ఈ మూవీ కోసం డైరెక్టర్ మురగదాస్ పవన్ కళ్యాణ్ ని కూడా సంప్రదించారట. అయితే ఈ సినిమాలో గుండు చేసుకొని,మతిమరుపు క్యారెక్టర్ లో హీరో నటించాల్సి ఉంటుంది. ఇలా నటిస్తే తన అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో? లేదో? అన్న అనుమానంతో పవన్ ఈ సినిమాను పెద్దగ పట్టించుకోలేదు. ఇదే విషయంపై పవన్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ..
తమిళ్ ప్రేక్షకులు తమ హీరో ఎలాంటి పాత్రలో నటించినా కూడా ఒప్పుకుంటారు. అదే మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం హీరో అంటే చాలా స్టైల్ గా.. హ్యాండ్సమ్ గా..నీట్ గా.. కనిపించాలి. అలా అయితేనే సినిమాలు చూస్తారు. అందుకే నేను గజిని సినిమని వదులుకున్నాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
గజినీ సినిమాను పవన్ తో పాటు మహేష్ బాబు అజిత్, మాధవన్, కమల్ హాసన్, విక్రమ్, విశాల్ లాంటి 12 మంది నటులు రిజెక్ట్ చేశారట. చివరగా సూర్య మాత్రం ఈ సినిమా కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
గజినీ సినిమాలో సూర్య, ఆసిన్
Bgm suits Well ❌#Ghajini suits Well 💯 ❤️🩹 @Suriya_offl#Karuppu#Suriya#SpotifyWrappedpic.twitter.com/gvTpQ6AjrJ
— Malayali (@JovizTk) December 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




