AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI క్రెడిట్ కార్డు వాడుతున్నారా? రేపటి నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ కట్..

తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐసీఐసీఐ బిగ్ షాకిచ్చింది. పలు సర్వీసులకు నవంబర్ 25వ తేదీ నుంచి ఛార్జీలను పెంచనుంది. అలాగే డిసెంబర్ 15వ తేదీ నుంచి మరికొన్ని కొత్త రూల్స్ అమలు చేస్తోంది. క్రెడిట్ కార్డుదారులపై ఇవి తీవ్ర ప్రభావం చూపించనున్నాయి.

ICICI క్రెడిట్ కార్డు వాడుతున్నారా? రేపటి నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ కట్..
Credit Card
Venkatrao Lella
|

Updated on: Nov 24, 2026 | 1:50 PM

Share

మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా.. అయితే బిగ్ అలర్ట్. నవంబర్ 25వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తుంటే మాత్రం ఈ కొత్త రూల్స్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. రేపటి నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు చేయనుండగా.. డిసెంబర్‌లో మరికొన్నింటిని వర్తింపచేయనుంది. దశలవారీగా ఈ నియమాలను ఐసీఐసీఐ బ్యాంక్ అమలు చేస్తోంది. అంతర్జాతీయ లావాదేవీలు, కార్డ్ రీప్లేస్‌మెంట్ ఫీజులు , ఉచిత బీమా ప్రయోజనం వంటి నిర్ణయాలు ఈ మార్పుల్లో ఉన్నాయి. ఇవి ఎవరెవరిపై ప్రభావం చూపనున్నాయనేది తెలుసుకుందాం.

బిజినెస్ బ్లాక్ అడ్వాంటేజ్, బిజినెస్ బ్లూ అడ్వాంటేజ్, ట్రావెల్ ఏజెంట్ కార్డ్, బిజినెస్ ప్లాటినం కేటగిరీల క్రెడిట్ కార్డులపై డైనమిక్ కరెన్సీ మార్పు ఛార్జీలను ఫీజులను 1 శాతం నుండి 3.50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. బిజినెస్, కార్పొరేట్ కార్డులపై పెరిగిన ఛార్జీలు నవంబర్ 25 నుంచి అమలు చేయనుంది. ఇక క్రెడిట్ కార్డు పోయినా, కొత్త కార్డు పొందాలనుకున్నా రీప్లేస్‌మెంట్ ఛార్జీలను పెంచనుంది. ప్రస్తుతం ఈ ఛార్జీలు రూ.200 ప్లస్ జీఎస్టీగా ఉండగా.. ఇక నుంచి రూ.300 ప్లస్ జీఎస్టీ వసూలు చేయనుంది. ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, 1838 రిజర్వ్, మరియు టైమ్స్ బ్లాక్ మినహా అన్ని ఐసీఐసీఐ కార్డులపై కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. డిసెంబర్ 11 నుంచి రీప్లేస్‌మెంట్ ఛార్జీలు అమల్లోకి వస్తాయని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. గతంలో కంటే ఏకంగా 50 శాతం మేర ఈ ఛార్జీలు పెంచారు.

ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, టైమ్స్ బ్లాక్, ఎమరాల్డ్, ఎమరాల్డ్ ప్రైవేట్, డయామాంట్, సఫైరో, రూబిక్స్ క్రెడిట్ కార్డ్ వాడేవారికి ఉచిత విమాన ప్రమాద బీమా డిసెంబర్ 15 నుంచి అందుబాటులో ఉండదు. Rubyx, Coral, Expressions, MakeMyTrip Platinum, MakeMyTrip Signature, HPCL Super Saver, Emirates Rubyx వంటి క్రెడిట్ కార్డ్‌లపై ఉచిత ఐనాక్స్ సినిమా టికెట్లను డిసెంబర్ 15వ తేదీ నుంచి తొలగించనుంది. ఇప్పటికే చాలా బ్యాంకులు ప్రస్తుతం అందిస్తున్న ఉచిత సినిమా టికెట్ల ప్రయోజనాలను తొలగించాయి. ఇప్పుడు ఐసీఐసీఐ కూడా అదే పని చేసింది. దీంతో ఇక నుంచి పలు రకాల క్రెడిట్ కార్డులపై ఉచిత సినిమా టికెట్లను పొందలేరు. అలాగే క్రెడిట్ కార్డు సంస్థలు ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుల్లో ఉచిత లాంజ్ సౌకర్యాన్ని నిలిపివేస్తున్నాయి. వీటి వల్ల తమపై ఆర్ధిక భారం పడుతుందనే ఉద్దేశంతో అన్ని బ్యాంకులు దశలవారీగా ఈ సౌకర్యాన్ని తొలగిస్తున్నాయి.

Follow Us