23 November 2026
Subhash
బంగారం ధరలు తగ్గుతుండటంతో లోన్ తీసుకున్నవారికి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. తాకట్టు పెట్టిన బంగారం విలువ తగ్గితే బ్యాంకులు అదనపు బంగారం లేదా కొంత రుణం తిరిగి చెల్లించాలని కోరే అవకాశం ఉంది.
మీరు రూ.1 లక్ష విలువైన బంగారంపై రూ.75 వేలు రుణం తీసుకున్నారనుకుందాం. బంగారం ధర 10% తగ్గితే దాని విలువ రూ.90 వేలకు పడిపోతుంది. దీంతో LTV నిష్పత్తి పెరుగుతుంది.
లోన్ టు వాల్యూ (LTV) అంటే తాకట్టు పెట్టిన బంగారం ప్రస్తుత విలువతో పోలిస్తే మీరు తీసుకున్న రుణం ఎంత శాతం ఉందో తెలిపే లెక్క. బంగారం ధర తగ్గితే ఈ నిష్పత్తి పెరుగుతుంది.
LTV పరిమితి దాటితే రుణగ్రహీతలను బ్యాంకులు సంప్రదించవచ్చు. కొంత అప్పు చెల్లించాలని లేదా అదనపు బంగారం తాకట్టు పెట్టాలని కోరవచ్చు.
2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన RBI మార్గదర్శకాల ప్రకారం రుణాలకు గరిష్ఠ LTV పరిమితులు: - రూ.2.5 లక్షల వరకు: 85%, రూ.2.5–5 లక్షలు: 80%, రూ.5 లక్షలకు పైన: 75%.
రుణం తిరిగి చెల్లించకపోతే, వర్తించే నిబంధనలు, ఒప్పందం ప్రకారం బ్యాంకులు తాకట్టు బంగారాన్ని వేలం వేయవచ్చు. అయితే వేలానికి ముందు రుణగ్రహీతకు తగిన నోటీసు ఇవ్వాలి.
రుణం తీసుకునే ముందు గరిష్ఠ పరిమితి కంటే తక్కువ మొత్తాన్ని తీసుకోవడం మంచిది. వడ్డీ, అసలు చెల్లింపులను గడువులోగా పూర్తి చేయాలి. నిర్లక్ష్యం చేయకూడదు.
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. అందుకే గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి.