మాస్క్‌డ్‌ ఆధార్ అంటే ఏమిటి? ఎలా డౌన్‌లోడ్ చేయాలి? బెనిఫిట్స్‌ ఏంటి?

October 31, 2026

Subhash

ఆధార్ జీవితంలో కీలకమైన గుర్తింపు పత్రం. బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, ఇతర అవసరాలకు తరచూ ఉపయోగిస్తుంటాం. అయితే ఆధార్ వివరాలు ఎక్కడపడితే అక్కడ షేర్ చేయడం మంచిది కాదు.

ఆధార్ కార్డు

UIDAI అందించే ఈ-ఆధార్‌లో ప్రత్యేకమైన ఆప్షనే మాస్క్డ్ ఆధార్. ఇందులో 12 అంకెల ఆధార్ నంబర్‌లో మొదటి 8 అంకెలు కనిపించవు. చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.

మాస్క్డ్ ఆధార్

మీ పూర్తి ఆధార్ నంబర్ ఇతరులకు తెలియకుండా ఉండేందుకు మాస్క్డ్ ఆధార్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అవసరం లేని చోట పూర్తి ఆధార్ నంబర్‌ను వెల్లడించకుండా గుర్తింపు వివరాలను చూపించవచ్చు.

వ్యక్తిగత

మాస్క్డ్ ఆధార్‌లో పేరు, ఫొటో, ఇతర గుర్తింపు వివరాలతో పాటు సురక్షితమైన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దీనిని స్కాన్ చేసి ఆఫ్‌లైన్‌లో గుర్తింపు వివరాలను ధృవీకరించవచ్చు.

క్యూఆర్ కోడ్

పూర్తి ఆధార్ నంబర్ అవసరం లేని గుర్తింపు ధృవీకరణ సందర్భాల్లో మాస్క్డ్ ఆధార్ ఉపయోగపడుతుంది. అయితే బ్యాంకులు, ఇతర సంస్థల్లో అవసరం  బట్టి అంగీకారం మారవచ్చు.

తెల్ల చొక్కాలే ఎందుకు

UIDAI అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in ను ఓపెన్ చేయండి. Download Aadhaar ఆప్షన్ ఎంచుకుని ఆధార్ నంబర్ నమోదు చేయండి. క్యాప్చా పూర్తి చేసి OTP పొందండి.

డౌన్‌లోడ్ ఎలా?

OTP నమోదు చేసిన తర్వాత 'Do you want a masked Aadhaar?' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. Verify and Download పై క్లిక్ చేస్తే మీ మాస్క్డ్ ఈ-ఆధార్ PDF రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది.

OTP

పూర్తి ఆధార్ నంబర్ అవసరం లేనప్పుడు మాస్క్డ్ ఆధార్‌ను ఉపయోగించండి. అధికారిక UIDAI వెబ్‌సైట్ లేదా యాప్‌లనే ఉపయోగించండి. 

ఆధార్