Bank Holidays: నేడు బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఎక్కడెక్కడంటే..?
బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. నేడు బ్యాంకులు మూతపడనున్నాయి. గురు నానక్ జయంతి సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు. దీంతో మీరు బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాలనుకుంటే మీ ప్రాంతంలో ఇవాళ సెలవు ఉందా.. లేదా అనేది చూసుకోవడం చాలా ముఖ్యం.

నవంబర్ 24వ తేదీన దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడ్డాయి. తెలంగాణలో కూడా నేడు బ్యాంకులు మూతపడనున్నాయి. సిక్కు మత స్థాపకుడైన గురు నానక్ దేవ్ జీ జన్మదినమైన గురు నానక్ జయంతి సందర్భంగా ఇవాళ పలు రాష్ట్రాల్లోని బ్యాంకులు బంద్ అయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులు ఒకేలా ఉండవు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో బ్యాంక్ హాలీవడేస్ వేర్వేరుగా ఉంటాయి. ఒకే పండుగను వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో జరుపుకుంటుంటారు. ఒక పండుగ కారణంగా బ్యాంకులు ఒక రాష్ట్రంలో మూసివేస్తే.. మరొక రాష్ట్రంలో తెరిచి ఉంటాయి. ప్రాంతీయ సెలవులు కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. జాతీయ పండుగలు అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి.
ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్..
గురునానక్ జయంతి,కార్తీక పూర్ణిమ,రహస్ పూర్ణిమ సందర్భంగా మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, హిమా ఝార్ఖ్‌నగర్‌లలో నవంబర్ 24న బ్యాంకులు బంద్ అయ్యాయి. గురునానక్ జయంతిని గురు నానక్ ప్రకాష్ ఉత్సవ్‌గా కూడా పిలుస్తారు. సిక్కు మత వ్యవస్థాపకులే కాకుండా ప్రముఖ సిక్కు గురువులలో ఒకరుగా గురు నానక్ గుర్తింపు పొందారు. సిక్కు మతం ప్రజలు ఆయనను ఎంతో గౌరవిస్తారు. దీంతో వారికి అత్యంత ముఖ్యమైన పండుగలలో గురునానక్ జయంతి ఒకటిగా చెప్పవచ్చు. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున సెలవు దినంగా ప్రకటించాయి. ఈ కారణంతో నేడు పలు రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి.
ఇక నవంబర్ 28వ తేదీన నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు మూతపడనుండగా.. నవంబర్ 29వ తేదీన ఆదివారం బ్యాంకులకు సెలవు. ఈ రోజు కూడా బ్యాంకులకు సెలవు రావడంతో.. ఈ వారంలో మొత్తం మూడ్రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతీ నెలా రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు ఆదివారాలు బ్యాంకులకు సాధారణ సెలవుగా చెప్పవచ్చు. అయితే బ్యాంక్ సెలవు రోజుల్లో మీరు ఆన్‌లైన్ విధానాల ద్వారా బ్యాంక్ లావాదేవీలు యథావిధంగా నిర్వహించుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ విధానాల ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు.
