Gold Prices: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ ఎగబాకిన బంగారం ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?
మంగళవారం బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో వరుసగా రెండో రోజు పెరిగినట్లయింది. సోమవారం నుంచి గోల్డ్ రేట్లు పెరుగుతుండగా.. వెండి ధరలు మాత్రం స్ధిరంగా కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరలు స్వల్పంగా పెరగడంతో కొనుగోలుదారులకు షాక్ అవుతున్నారు.

బంగారం ధరలు గత వారంలో భారీగా తగ్గాయి. గత వారంలో మొత్తం తలం గోల్డ్ రేటు రూ.13 వేల మేర తగ్గి భారీ ఊరట కలిగించింది. కానీ ఈ వారంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. సోమవారం నుంచి పసిడి ధరలు పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. సోమవారం ధరలు పుంజుకోగా.. మంగళవారం కూడా అవే బాటలో నడిచాయి. నవంబర్ 24న కూడా బంగారం ధరలు ఎగబాకాయి. వరుసగా రెండో రోజు కూడా పుంజుకోవడం కొనుగోలుదారులకు నిరాశను మిగిల్చింది. నవంబర్ 24వ తేదీన మంగళవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం
నేటి బంగారం ధరలివే..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,26,570గా పలుకుతుండగా.. ఆభరణాల తయారీ కోసం ఉపయోగించే 22 క్యారెట్ల రేటు రూ.1,16,010కు లభిస్తున్నాయి.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,570 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,16,010గా ట్రేడవుతున్నాయి.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,26,720కు లభిస్తుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,16,160 వద్ద కొనసాగుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,26,570గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,16,010 వద్ద ట్రేడవుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,570గా ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,16,010 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఇలా..
బంగారంతో పోలిస్తే వెండి ధరలు భిన్నంగా కొనసాగుతున్నాయి. గోల్డ్ రేట్ల పెరగ్గా.. సిల్వర్ ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి.
-మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ.1,74,900గా కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ.1.75 లక్షల వద్ద స్థిరపడింది.
-హైదరాబాద్‌లోనూ కేజీ వెండి ధర రూ.1,74,900 వద్ద కొనసాగుతోంది
-చెన్నై, బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,74,900 వద్ద ట్రేడవుతోంది.
