పండుగలు, పూతయారీలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, అందులో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను వేయాలి. నెయ్యి ఏమీ వేయకుండానే, మంటను తక్కువ మంటలో పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు దోరగా వేయించాలి. రవ్వ మంచి సువాసన వచ్చేంత వరకు, రంగు మారేంత వరకు వేయించి, ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ ఎరుపు రంగులో ఉంటుంది, సాధారణంగా దొరికే పసుపు రంగు రవ్వ కంటే భిన్నంగా ఉంటుంది. తర్వాత అదే పాన్‌లో రెండు టేబుల్స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.జల సమయంలో దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి అత్యంత ప్రీతిపాత్రమైన వంటకాలలో గోధుమ రవ్వ ప్రసాదం ఒకటి. నోట్లో కరిగిపోయేలా, కమ్మనైన రుచితో ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ఎర్ర గోధుమ రవ్వ: 1 కప్పు, నీళ్లు: 4 కప్పులు, తురుముకున్న బెల్లం: 1 కప్పు, పంచదార: 1/2 కప్పు, నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ , యాలకుల పొడి: 1/2 టీస్పూన్, పచ్చ కర్పూరం: చిటికెడు, ఉప్పు: 1/4 టీస్పూన్.