ముందుగా ఒక కట్ట తాజా పాలకూరను తీసుకుని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టెప్ 1
ఇంకా దీనిలో కట్ చేసి పెట్టుకున్న పాలకూర, 2 పచ్చిమిర్చి, ఇంకా అల్లం కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
స్టెప్ 2
ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కప్పుల ఇడ్లీ రవ్వ, ఇంకా కొద్దిగా ఇడ్లీ పిండిని తీసుకోవాలి.
స్టెప్ 3
ఇంకా దీనిలో తయారు చేసుకున్న పాలకూర పేస్ట్ ను వేసి దీనిని బాగా కలుపుకోవాలి.
స్టెప్ 4
ఇంకా దీనిలో రుచికి తగినంత ఉప్పు, ఇంకా కొద్దిగా అర టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి కలపాలి.
స్టెప్ 5
ఇంకా పిండి మరీ గట్టిగా ఉంటే దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఇంకా దీనిని ఇడ్లీ పిండిలా తయారు చేసుకోవాలి.
స్టెప్ 6
ఇంకా ఈ మిశ్రమాన్ని తీసుకుని 10 నుంచి 15 నిమిషాలు తీసుకుం పక్కన పెట్టి నాననివ్వాలి. ఈ ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా ఆయిల్ రాసి పాలకూర పిండిని తీసుకోవాలి
స్టెప్ 7
ఇంకా ఇడ్లీ కుక్కర్‌లో నీళ్లు పోసి ప్లేట్లు పెట్టి 15 నిమిషాల పాటు ఆవిరిపై దీనిని ఉడికించుకోవాలి. ఈ ఇడ్లీలు చల్లారిన తర్వాత ప్లేట్ల నుంచి తీసి కొబ్బరి చట్నీతో దీనిని చేసుకోవచ్చు.