AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న పిల్లలు లొట్టలేసుకొని తింటారు.. టేస్టీ లడ్డు ఇదే

పిల్లలకు సాయంత్రం అయ్యిందంటే చాలు ఏదో ఒకటి తినాలని పిస్తుంటుంది. అయితే చాలా మందికి పాలల మద్దలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే ఇప్పుడు వాటిని చాలా సులభంగా, పిల్లలు ఇష్టంగా తినేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి.

Samatha J
|

Updated on: Nov 23, 2026 | 11:30 PM

Share
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మరమరాల ముద్దలు ఆరోగ్యానికి చాలా మంచివి. అంతే కాకుండా వీటిని చేయడం కూడా చాలా సులువు అందువలన చాలా మంది ఇష్టంగా ఈ ముద్దలను తింటుంటారు. కాగా, ఇప్పుడు మనం వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కాగా, ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మరమరాలు: 1/4 కిలో,  బెల్లం: 1/4 కిలో,   నీరు: 1 కప్పు, నెయ్యి లేదా నూనె.

1 / 5
తయారీలోకి వెళ్లితే..  ముందుగా ఒక మందపాటి పాన్‌ను స్టవ్‌పై పెట్టి, అందులో 1/4 కిలో బెల్లాన్ని వేయండి. బెల్లాన్ని తురిమి కానీ, చిన్న ముక్కలుగా చేసి కానీ వేస్తే త్వరగా కరుగుతుంది. ఇందులో సుమారు ఒక కప్పు నీళ్లను చేర్చండి. నీళ్లు బెల్లం పూర్తిగా తడిచేలా చూసుకోవాలి. స్టవ్‌ను సిమ్‌లో ఉంచి, బెల్లం పూర్తిగా కరిగేంతవరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్‌లో పెడితే బెల్లం అడుగు అంటుకుని మాడిపోయే అవకాశం ఉంది. బెల్లం పూర్తిగా కరిగి, తీగ పాకం వచ్చిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ బెల్లం నీరును వడపోసి తీసుకోవాలి.. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే దుమ్ము, రాళ్లు, ఇతర నలకలు తొలగిపోయి, శుభ్రమైన పాకం లభిస్తుంది.

2 / 5
వడకట్టిన బెల్లం ద్రవాన్ని తిరిగి అదే శుభ్రమైన పాన్‌లో పోసి, స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. పాకం చిక్కబడేంతవరకు మరిగించండి. సుమారు 10 నిమిషాల పాటు మరిగిన తర్వాత, పాకం చిక్కగా తయారవుతుంది. పాకం చిక్కబడిన, పాకం వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి,  మరమరాలను పాకంలో వేయండి. ఇక్కడ మనం 1/4 కిలో బెల్లం తీసుకున్నాం కాబట్టి సాధారణంగా 1/4 కిలో మరమరాలు సరిపోతాయి. అయితే, బెల్లం నాణ్యతను బట్టి కొద్దిగా ఎక్కువ లేదా తక్కువ మరమరాలు పట్టవచ్చు. మరమరాలను పాకంలో వేసిన తర్వాత, పాకమంతా మరమరాలకు బాగా పట్టేలా త్వరగా, జాగ్రత్తగా కలపండి.

3 / 5
తర్వాత ఒక ప్లేట్‌కు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు మీ చేతులకు కొద్దిగా నీటిని తడుపుకోండి. ఇలా చేయడం వల్ల వేడి పాకం చేతులకు కాలకుండా ఉంటుంది, అలాగే మరమరాలు చేతులకు అంటుకోకుండా ఉంటాయి. పాకం వేడిగా ఉన్నప్పుడే, త్వరగా మరమరాల మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా లేదా లడ్డూలుగా గట్టిగా చుట్టుకోండి. మిశ్రమం చల్లారిపోతే గట్టిబడి, ముద్దలు చుట్టడం కష్టం అవుతుంది. అందుకే మెల్లగా ఉండలు చుట్టుకోవాలి.

4 / 5
ఈ విధంగా అన్ని బొరుగు ముద్దలను తయారుచేసుకున్న తర్వాత, వాటిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరచుకోండి. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం కరకరలాడుతూ, తాజాగా ఉంటాయి. అంతే కాకుండా వీటిని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు

5 / 5
Follow Us