రామాయణం మూవీ
భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మహాకావ్యంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. అలాగే రాకింగ్ స్టార్ యష్ లంకేశ్వరుడైన రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. బలపరాక్రమాలకు ప్రతిరూపమైన అంజనేయుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ నటిస్తున్నారు. ప్రపంచ స్థాయి హంగులతో, అత్యుత్తమ వీఎఫ్ఎక్స్ (VFX) సాంకేతికతతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ , హ్యాన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హిందూ సనాతన ధర్మం , మన ఇతిహాస గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పేలా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్‌లోని ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోలు ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల్లో పాలుపంచుకుంటున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా వస్తున్న ఈ దృశ్యకావ్యం మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంకా చదవండిNews not found!