AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Movie: ఆస్కార్ రేసులో ‘రామాయణ’ మరో ముందడుగు.. ఫైనల్ నామినేషన్స్ రిజల్ట్ ఎప్పుడంటే?

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారాల పోటీలో ‘రామాయణ’ మరో ముందడుగు వేసింది. రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ '99వ ఆస్కార్స్‌లో ఉత్తమ వీఎఫ్ఎక్స్ విభాగంలో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకుంది. డిసెంబరు 15న టాప్‌-10 జాబితాను ప్రకటించనున్నారు.

Ramayana Movie: ఆస్కార్ రేసులో 'రామాయణ' మరో ముందడుగు.. ఫైనల్ నామినేషన్స్ రిజల్ట్ ఎప్పుడంటే?
Ramayana Movie
Basha Shek
|

Updated on: Nov 26, 2026 | 9:23 AM

Share

భారతీయ సినిమా పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించిన ‘ రామాయణం ‘ చిత్రం అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రం 99వ ఆస్కార్ రేసులో నిలిచింది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో రామాయణం టాప్ 20 జాబితాలో మెరుస్తోంది. ఇప్పుడీ సినిమా హాలీవుడ్ దిగ్గజ చిత్రాలతో పోటీ పడుతోంది. కాగా రామాయణ చిత్రం ఆస్కార్ ఎంట్రీ ఇవ్వడం అంతర్జాతీయ వేదికపై భారతీయ సాంకేతిక రంగానికి లభించిన అతిపెద్ద గౌరవమని చెప్పవచ్చు. ఆస్కార్ అకాడమీ విఎఫ్ఎక్స్ విభాగం తదుపరి రౌండ్ కోసం 20 చిత్రాలను ఎంపిక చేసింది. అకాడమీ ఇంకా ఈ జాబితాను అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రతిష్టాత్మక ‘వెరైటీ’ మీడియా ఈ పేర్లను ధృవీకరించింది. క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ కూడా ఈ జాబితాలో ఉంది. అలాగే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ‘డ్యూన్: పార్ట్ 3’ చిత్రాలతో పోటీ పడుతూ రామాయణం ఈ గౌరవాన్ని దక్కించుకుంది. అనేక భారీ బడ్జెట్ చిత్రాలు టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’, ‘సూపర్‌గర్ల్’ ఇందులో ఉన్నాయి. ‘గాడ్జిల్లా మైనస్ జీరో’, ‘మోవానా’ కూడా పోటీలో ఉన్నాయి. ‘జుమాంజి: ఓపెన్ వరల్డ్’ మరియు ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. విశేషం ఏమిటంటే, సోనీ పిక్చర్స్ సంస్థ నుంచి మూడు చిత్రాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వాటిలో ‘రామాయణం’ ఒకటి కావడం గర్వకారణం.

ఆస్కార్ రేసు కోసం తదుపరి విడత ఓటింగ్ డిసెంబర్ 7 నుండి 11 వరకు జరుగుతుంది. ఆ తర్వాత, చివరి 10 చిత్రాల షార్ట్‌లిస్ట్ డిసెంబర్ 15న విడుదల అవుతుంది. ఆస్కార్‌ల తుది నామినేషన్లను జనవరి 21, 2027న ప్రకటిస్తారు. తదుపరి విడత ఓటింగ్‌లో కూడా రామాయణం చోటు దక్కించుకుంటుందో లేదో అనేది ఆసక్తికరంగా మారింది. నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, యష్‌కు చెందిన ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’, ‘డీఎన్ఈజీ’ సంస్థలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రామాయణ సినిమాను నిర్మించాయి. నితేష్ తివారీ తెరకెక్కించినఈ సినిమా ఇప్పటికే రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. త్వరలోనే ఈ మూవీ రూ.2000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది. రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ తో పాటు సన్నీ డియోల్, శోభన, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హరీశ్‌ ఉత్తమన్‌, ఫైసల్‌ మాలిక్‌, వివేక్‌ ఒబెరాయ్‌, కునాల్‌ కపూర్‌, ముకేశ్‌ తివారి, అనుపమ్ ఖేర్, సౌరబ్‌ సచ్‌దేవ్‌, రవి దూబే, ఆదినాథ్‌ కొఠారే, నితీశ్‌ శర్మ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులో 'రామాయణ' మరో ముందడుగు
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులో 'రామాయణ' మరో ముందడుగు
JEE మెయిన్‌ 2027 తొలి విడతకు 15 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు..
JEE మెయిన్‌ 2027 తొలి విడతకు 15 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు..
రన్నింగ్‌లో ఉండగా మంటలు.. క్షణాల్లో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు
రన్నింగ్‌లో ఉండగా మంటలు.. క్షణాల్లో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు
రూ. 2 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్లు..
రూ. 2 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్లు..
ఇద్దరి మధ్య 26 ఏళ్ల గ్యాప్.. ఐపీఎల్ వేలంలో ఈ వింత చూశారా?
ఇద్దరి మధ్య 26 ఏళ్ల గ్యాప్.. ఐపీఎల్ వేలంలో ఈ వింత చూశారా?
గాజు గ్లాసులు, గిన్నెలు తళతళ మెరవాలంటే.. ఈ 4 చిట్కాలు తెలుసుకోండి
గాజు గ్లాసులు, గిన్నెలు తళతళ మెరవాలంటే.. ఈ 4 చిట్కాలు తెలుసుకోండి
మరో సర్‌ప్రైజింగ్ లుక్‌లో సాయి పల్లవి.. కొత్త సినిమా పాట చూశారా?
మరో సర్‌ప్రైజింగ్ లుక్‌లో సాయి పల్లవి.. కొత్త సినిమా పాట చూశారా?
2 రోజుల్లోనే తెలంగాణ SI పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
2 రోజుల్లోనే తెలంగాణ SI పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
తిరుమలలో అరుదైన ఘట్టం.. శ్రీవారికి 121కిలోల భారీ బంగారు కానుక
తిరుమలలో అరుదైన ఘట్టం.. శ్రీవారికి 121కిలోల భారీ బంగారు కానుక
తోట వైకుంఠం అరుదైన కళాఖండాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్..
తోట వైకుంఠం అరుదైన కళాఖండాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్..